Site icon TeluguMirchi.com

Aadarsha Kutumbam OTT : వెంకటేష్ ఆదర్శ కుటుంబం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?


విక్టరీ వెంకటేష్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో వచ్చిన ఆదర్శ కుటుంబం సినిమా ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. విడుదలకు ముందు పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య థియేటర్లలోకి వచ్చింది. అయితే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో విఫలమైంది. బాక్సాఫీస్ వద్ద కూడా ఆశించిన వసూళ్లు రాబట్టలేకపోయింది. ఇప్పుడు ఈ సినిమా నవంబర్ 27 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. నెట్‌ఫ్లిక్స్ తన Coming Soon జాబితాలో ఈ విషయాన్ని అధికారికంగా వెల్లడించింది. థియేటర్లలో సినిమా చూడలేకపోయిన వారు ఇప్పుడు ఇంట్లోనే చూసే అవకాశం ఉంది.

హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ సినిమాను నిర్మించారు. ఇందులో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించారు. యువినా పార్తవి, నివేదా పేతురాజ్, నారా రోహిత్, పూజిత పొన్నాడ, రావు రమేష్, రాజా ప్రజ్వల్, దేవయాని శర్మ, బ్రహ్మాజీ తదితరులు ముఖ్యమైన పాత్రలు పోషించారు. థమన్ సంగీతం అందించారు. థియేటర్లలో ప్రేక్షకులను మెప్పించలేకపోయిన ఈ సినిమా ఓటీటీలో అయినా మంచి ఆదరణ పొందుతుందేమో చూడాలి.

Exit mobile version