Site icon TeluguMirchi.com

గగన్ బాబు, కశికా కపూర్ జంటగా గోల్డెన్ ప్రొడక్షన్స్ తొలి చిత్రం లాంచ్ !

Actorgagan
గగన్ బాబు, కశికా కపూర్ హీరో-హీరోయిన్స్‌గా, సత్యం రాజేష్, సాయి రోనఖ్ కీలక పాత్రల్లో నటిస్తున్న కొత్త చిత్రం ఈ రోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైంది. ఎ కె జంపన్న దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను గోల్డెన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం1 గా తోట లక్ష్మీ కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. ముహూర్తపు సన్నివేశానికి సాహు గారపాటి క్లాప్ కొట్టగా, వివేక్ కూచిభట్ల కెమెరా స్విచాన్ చేశారు.

ఎమోషనల్ సస్పెన్స్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో పృద్వీ, మణిచందన, మహేష్ విట్ట, రంగస్థలం మహేష్ తదితరులు నటిస్తున్నారు. అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రానికి వీకే రామరాజు డీవోపీగా, జేకే మూర్తి ఆర్ట్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానుంది.

Exit mobile version