Site icon TeluguMirchi.com

పవర్‌స్టార్‌ ‘OG 2’పై బిగ్‌ అప్‌డేట్‌.. ఇక వరుస సర్‌ప్రైజ్‌లేనా?

OG

OG 2: పవర్‌స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ‘OG 2’పై ఇండస్ట్రీ వర్గాల్లో ఓ ఆసక్తికరమైన అప్‌డేట్‌ వినిపిస్తోంది. ‘OG’ చిత్రానికి సీక్వెల్‌గా తెరకెక్కనున్న ఈ సినిమాకు పవన్‌ కల్యాణ్‌ డేట్స్‌ కేటాయించినట్లు సమాచారం. దీంతో ఈ ప్రాజెక్ట్‌ పనులు మరింత వేగం పుంజుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ‘OG 2’ ప్రీ-ప్రొడక్షన్‌ పనులు శరవేగంగా కొనసాగుతున్నట్లు టాక్‌. సినిమాకు సంబంధించిన కీలక ఏర్పాట్లు పూర్తయిన తర్వాత మేకర్స్‌ వరుసగా అప్‌డేట్స్‌ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు సమాచారం. దీంతో పవన్‌ అభిమానుల్లో ఈ సీక్వెల్‌పై ఆసక్తి మరింత పెరుగుతోంది.

ఇక పవన్‌ కల్యాణ్‌ పుట్టినరోజైన సెప్టెంబర్‌ 2న ‘OG 2’కు సంబంధించి ప్రత్యేక సర్‌ప్రైజ్‌ ఇవ్వాలని మేకర్స్‌ గట్టిగా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా యానిమేషన్‌ ప్రోమోను విడుదల చేసే అవకాశం ఉందని సినీ వర్గాల్లో టాక్‌ వినిపిస్తోంది. అయితే దీనిపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. మరోవైపు ‘OG’తో పోలిస్తే సీక్వెల్‌ను మరింత భారీ స్థాయిలో తెరకెక్కించేందుకు దర్శకుడు సుజీత్‌ ప్లాన్‌ చేస్తున్నట్లు తెలుస్తోంది. యాక్షన్‌తో పాటు ఎమోషన్‌కు కూడా అధిక ప్రాధాన్యం ఇస్తూ ‘OG 2’ను రూపొందించనున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. ‘OG’ క్రియేట్‌ చేసిన హైప్‌కు కొనసాగింపుగా ‘OG 2’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రీ-ప్రొడక్షన్‌ పనులు పూర్తయి అధికారిక అప్‌డేట్స్‌ ప్రారంభమైతే పవన్‌ ఫ్యాన్స్‌కు వరుస ట్రీట్‌లు ఖాయమనే టాక్‌ వినిపిస్తోంది.

Exit mobile version