Site icon TeluguMirchi.com

ఏం చేస్తున్నావయ్యా లోకేష్!.. ‘AA23’లో బన్నీని అస్సలు గుర్తుపట్టలేరట!

AA23

AA23: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ దర్శకుడు లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘AA23’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతి అప్డేట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరో ఆసక్తికరమైన బజ్ ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా చక్కర్లు కొడుతోంది.

తాజా సమాచారం ప్రకారం.. ‘AA23’ను లోకేష్ కనగరాజ్ ఓ రా అండ్ ఇంటెన్స్ గ్యాంగ్‌స్టర్ డ్రామాగా రూపొందించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ పాత్రను ఇప్పటివరకు ఆయన చేసిన ఏ పాత్రతోనూ పోల్చలేని విధంగా లోకేష్ డిజైన్ చేస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ముఖ్యంగా ‘పుష్ప’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న పుష్పరాజ్ ఇమేజ్‌ను పూర్తిగా మరిచిపోయేలా కొత్త స్క్రీన్ ఐడెంటిటీని బన్నీకి ఇవ్వడమే లక్ష్యంగా లోకేష్ కనగరాజ్ పని చేస్తున్నట్లు టాక్. ఇందుకోసం అల్లు అర్జున్, లోకేష్ కనగరాజ్ గత కొన్ని నెలలుగా పాత్ర లుక్, బాడీ లాంగ్వేజ్, స్టైల్, మేకోవర్‌పై విస్తృతంగా రిసెర్చ్, ప్రయోగాలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. అల్లు అర్జున్ కెరీర్‌లో మరో సరికొత్త అవతారాన్ని ప్రేక్షకులకు పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఈ ప్రాజెక్ట్‌ను అత్యంత ప్రతిష్ఠాత్మకంగా లోకేష్ తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. అయితే ఈ ప్రచారంపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

Exit mobile version