
AAA Cinemas: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, ఏషియన్ గ్రూప్ భాగస్వామ్యంతో ప్రారంభమైన AAA సినిమాస్ సక్సెస్‌ఫుల్‌గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లోని అమీర్‌పేట్‌లో స్టార్ట్ అయిన ఈ ప్రీమియం మల్టీప్లెక్స్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. ఇప్పుడు అదే బ్రాండ్‌ను మరింత విస్తరించే దిశగా అల్లు అర్జున్, ఏషియన్ గ్రూప్ మరో కీలక అడుగు వేస్తున్నారు.
ఈ క్రమంలో విశాఖపట్నంలో కొత్త AAA మల్టీప్లెక్స్ ప్రారంభానికి సిద్ధమైంది. విశాఖలోని ఇనార్బిట్ మాల్‌లో అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించిన ఈ 8-స్క్రీన్ ప్రీమియం మల్టీప్లెక్స్ పనులు దాదాపు పూర్తయ్యాయని సమాచారం. ప్రస్తుతం తుది ఏర్పాట్లు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఈ కొత్త మల్టీప్లెక్స్‌ను ఆగస్టు 9న ఘనంగా ప్రారంభించే అవకాశం ఉంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన రావాల్సి. హైదరాబాద్‌లోని AAA సినిమాస్‌కు లభించిన ఆదరణను వైజాగ్‌లోనూ కొనసాగించాలని అల్లు అర్జున్, ఏషియన్ గ్రూప్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అత్యాధునిక సాంకేతికత, ప్రీమియం సీటింగ్, అత్యుత్తమ ఆడియో-విజువల్ అనుభూతితో ఈ మల్టీప్లెక్స్ ప్రేక్షకులకు కొత్త స్థాయి సినిమా అనుభవాన్ని అందించనుందని చెబుతున్నారు.
