Site icon TeluguMirchi.com

Aamir Khan: ముచ్చటగా మూడో పెళ్లికి రెడీ అయిన ఆమిర్ ఖాన్? ముహూర్తం ఎప్పుడంటే!

Aamir Khan

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్ ఆమిర్ ఖాన్ పర్సనల్ లైఫ్‌కు సంబంధించి నెట్టింట ఎప్పుడూ ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది. తాజాగా బీటౌన్ వర్గాల నుంచి వస్తున్న ఒక సెన్సేషనల్ లీక్ ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. 61 ఏళ్ల ఆమిర్ ఖాన్ ఇప్పుడు మూడో పెళ్లికి రెడీ అయ్యారనే వార్త టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ మళ్లీ పెళ్లి పీటలు ఎక్కబోతున్నారా? అంటే అవుననే అంటున్నాయి బాలీవుడ్ ఇన్‌సైడ్ వర్గాలు. గత కొంతకాలంగా ఒంటరిగా ఉంటున్న ఈ మిస్టర్ పర్‌ఫెక్షనిస్ట్.. తాజాగా తన ప్రియురాలు గౌరీ స్ప్రత్‌తో కొత్త జీవితాన్ని ప్రారంభించనున్నారనే వార్త బీటౌన్‌లో దావానంలా వ్యాపిస్తోంది. వీరిద్దరూ త్వరలోనే అధికారికంగా భార్యాభర్తలు కాబోతున్నారని సమాచారం.

ఈ క్రేజీ మ్యారేజ్‌కు సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ డేట్ కూడా నెట్టింట వైరల్ అవుతోంది. వచ్చే నెల జులై 5న ఆమిర్ ఖాన్ తన నివాసంలోనే చాలా సింపుల్‌గా, ఎలాంటి హడావుడి లేకుండా ‘రిజిస్టర్ మ్యారేజ్’ చేసుకోబోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ వేడుకకు కేవలం ఇరు కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులైన కొద్దిమంది బాలీవుడ్ సెలబ్రిటీలు మాత్రమే హాజరుకానున్నట్లు సమాచారం. ఆమిర్ ఖాన్‌కు ఇదివరకే రెండు పెళ్లిళ్లు అయిన సంగతి తెలిసిందే. మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్న ఆయన.. ఆమెతో విడిపోయాక కిరణ్ రావును రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే 2021లో కిరణ్ రావుతో కూడా విడాకులు తీసుకుంటున్నట్లు ఆమిర్ అధికారికంగా ప్రకటించారు. అప్పటినుంచి ఒంటరిగా ఉంటున్న ఆమిర్.. ఇప్పుడు మూడోసారి పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త అభిమానుల్లో తీవ్ర ఆసక్తిని రేకెత్తిస్తోంది. అయితే ఈ వెడ్డింగ్ రూమర్స్‌పై ఆమిర్ ఖాన్ టీమ్ గానీ, ఆయన కుటుంబ సభ్యులు గానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయినప్పటికీ, సోషల్ మీడియాలో మాత్రం ఈ బాలీవుడ్ క్రేజీ లవ్ స్టోరీపై నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు పెడుతూ పోస్టులను వైరల్ చేస్తున్నారు.

Exit mobile version