Site icon TeluguMirchi.com

Aamir Khan: మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్న అమీర్ ఖాన్.. రేపే మూడో పెళ్లి!

Aamir Khan

Aamir Khan: బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ వ్యక్తిగత జీవితానికి సంబంధించి ఒక సంచలన వార్త ఇప్పుడు తెగ హల్‌చల్ చేస్తుంది. ఈ ఆదివారం (రేపు) ఆయన మరోసారి పెళ్లి కొడుకు కాబోతున్నారు. 50 ప్లస్ వయసులో అమీర్ ఖాన్ మూడో వివాహానికి సిద్ధమవ్వడం ప్రస్తుతం దేశవ్యాప్తంగా సినీ వర్గాల్లోనూ, సోషల్ మీడియాలోనూ హాట్ టాపిక్‌గా మారింది. ఈ వివాహానికి సంబంధించిన వివరాలను అమీర్ ఖాన్ అధికారికంగా ప్రకటించారు.

ఇది పూర్తిగా కుటుంబ సభ్యులు, అత్యంత ఆప్తుల మధ్య జరిగే ప్రైవేట్ వేడుక అని అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. “ఎలాంటి హంగూ ఆర్భాటాలు లేకుండా, కేవలం కుటుంబ సభ్యుల సమక్షంలో నిరాడంబరంగా ఈ వివాహాన్ని జరుపుకోబోతున్నాం” అని ఆయన పేర్కొన్నారు. అయితే ఈ పెళ్లిలో అన్నిటికంటే పెద్ద హైలైట్ ఏంటంటే.. అమీర్ ఖాన్ చేసుకోబోయే ఈ మూడో పెళ్లికి ఆయన మాజీ భార్యలిద్దరూ హాజరవుతుండటం విశేషం.

అమీర్ ఖాన్ మొదటి భార్య రీనా దత్తా, రెండో భార్య కిరణ్ రావు ఇద్దరూ ఈ వేడుకకు విచ్చేసి కొత్త జంటను ఆశీర్వదించబోతున్నట్లు తెలుస్తోంది. విడాకులు తీసుకున్నప్పటికీ మాజీ భార్యలతో అమీర్ ఖాన్‌కు ఇప్పటికీ మంచి స్నేహసంబంధాలు ఉన్నాయి. గతంలో పలు సందర్భాల్లో వీరంతా ఒకే వేదికపై కనిపించి సందడి చేశారు. ఇప్పుడు ఏకంగా మూడో పెళ్లికి కూడా మాజీ భార్యలు హాజరవుతుండటం బాలీవుడ్‌లో సరికొత్త చర్చకు దారితీసింది. ప్రస్తుతం ముంబైలోని ఆయన నివాసంలో పెళ్లి పనులు మొదలైనట్లు తెలుస్తోంది.

Exit mobile version