
Karthi 31: కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్‌లో ఉన్నారు. స్టోరీల సెలక్షన్‌లో వైవిధ్యాన్ని చూపిస్తూ తెలుగు, తమిళ ప్రేక్షకులలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఆయన.. తాజాగా తన నెక్స్ట్ మూవీకి సంబంధించి ఒక క్రేజీ అప్‌డేట్‌తో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నారు. గత ఏడాది బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన ‘దాదా’ (Dada) మూవీ డైరెక్టర్ గణేష్ బాబుతో కార్తీ తన నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్లు ప్రస్తుతం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. తాజా సమాచారం ప్రకారం.. డైరెక్టర్ గణేష్ బాబు ఇటీవల కార్తీకి ఒక ఆసక్తికరమైన స్టోరీని వినిపించారట. ఆ లైన్ కార్తీకి బాగా నచ్చిందని టాక్. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు తుది దశకు చేరుకున్నాయని తెలుస్తోంది. అన్నీ అనుకున్నట్లు కుదిరితే ఈ చిత్రం కార్తీ కెరీర్‌లో 31వ సినిమాగా (#Karthi31) తెరకెక్కనుంది. ఈ ఏడాది (2026) చివరికల్లా లేదా వచ్చే ఏడాది (2027) స్టా్ర్టింగ్‌లో ఈ క్రేజీ ప్రాజెక్ట్ అధికారికంగా పట్టాలెక్కే అవకాశం ఉందట.
మరోవైపు కార్తీ ప్రస్తుతం తన 30వ ప్రాజెక్ట్ (#Karthi30) షూటింగ్‌తో ఫుల్ బిజీగా గడుపుతున్నారు. టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్, ‘మ్యాడ్’ ఫేమ్ కళ్యాణ్ శంకర్ డైరెక్షన్‌లో ఈ సినిమా తెరకెక్కుతుంది. ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ బైలింగ్వల్ (తెలుగు-తమిళ) చిత్రం ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీనితో పాటే ఆయన ఎంతో ప్రతిష్టాత్మకంగా నటిస్తున్న ‘సర్దార్ 2’ సినిమా షూటింగ్ కూడా సాగుతోంది. ఈ రెండు భారీ ప్రాజెక్టులు పూర్తి అయిన వెంటనే, గణేష్ బాబు డైరెక్షన్‌లో అనుకుంటున్న సినిమా సెట్స్‌పైకి వెళ్లనుందని సమాచారం. ‘దాదా’ లాంటి ఎమోషనల్ హిట్‌ను ఇచ్చిన డైరెక్టర్‌తో కార్తీ జతకట్టబోతున్నారనే వార్త తెలియడంతో అటు తమిళంతో పాటు ఇటు తెలుగు అభిమానుల్లోనూ సరికొత్త అంచనాలు రేకెత్తుతున్నాయి. దీనిపై అఫీషియల్ అనౌన్స్‌మెంట్ రావాల్సి ఉంది.
