Site icon TeluguMirchi.com

Suriya: ‘కరుప్పు’ సక్సెస్‌తో రూ.100 కోట్లకు చేరిన స్టార్ హీరో రెమ్యూనరేషన్!

Suriya

Suriya: తమిళ స్టార్ హీరో సూర్య రెమ్యూనరేషన్‌కు సంబంధించిన ఒక సంచలన వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఆయన నటించిన తాజా బ్లాక్‌బస్టర్ హిట్ ‘కరుప్పు’ బాక్సాఫీస్ వద్ద సాధించిన అఖండ విజయం తర్వాత, సూర్య తన నెక్ట్స్ చిత్రాలకు రెమ్యూనరేషన్‌ను భారీగా పెంచేసినట్లు కోలీవుడ్ ట్రేడ్ వర్గాల సమాచారం. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం.. సూర్య తన రాబోయే కొత్త ప్రాజెక్ట్‌లకు ఏకంగా రూ.100 కోట్ల భారీ పారితోషికాన్ని అందుకోబోతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం.. ఆయన హీరోగా తెరకెక్కబోయే ప్రతిష్టాత్మక ల్యాండ్‌మార్క్ చిత్రం ‘సూర్య 49’ నుంచే ఈ రెమ్యూనరేషన్ వర్తించనుందట. ఇకపై ఆయన చేయబోయే సినిమాలన్నింటికీ ఇదే స్టాండర్డ్ రెమ్యూనరేషన్‌గా మారే అవకాశం ఉందని చర్చించుకుంటున్నారు.

ఇటీవలే రిలీజ్ అయిన ‘కరుప్పు’ చిత్రంలో సూర్య నటనకు ప్రేక్షకుల నుంచి, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. దీంతో ఆయన మార్కెట్ వాల్యూ ఒక్కసారిగా పాన్ ఇండియా లెవల్లో స్కై హైకి చేరింది. రూ.100 కోట్ల క్లబ్‌లో చేరడం ద్వారా సౌత్ ఇండియాలోనే అత్యధిక పారితోషికం తీసుకుంటున్న టాప్ హీరోల సరసన సూర్య నిలిచారు. అయితే ఈ 100 కోట్ల రెమ్యూనరేషన్ డీల్‌పై సదరు నిర్మాణ సంస్థల నుంచి కానీ, సూర్య టీమ్ నుంచి కానీ ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు.

Exit mobile version