
Mass Surprise: సౌత్ ఇండియన్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం ‘కరుప్పు’ సినిమా బ్లాక్‌బస్టర్ సక్సెస్‌తో ఫుల్ జోష్‌లో ఉన్నారు. అదే ఊపుతో తన నెక్ట్స్ చిత్రం ‘విశ్వనాథ్ & సన్స్’ ద్వారా ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. ‘సార్’, ‘లక్కీ భాస్కర్’ చిత్రాల ఫేమ్ వెంకీ అట్లూరి డైరెక్షన్ తెరకెక్కుతోన్న ఈ భారీ ప్రాజెక్ట్‌లో మలయాళ బ్యూటీ మమితా బైజు హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న సూర్య అభిమానులకు మ్యూజిక్ డైరెక్టర్ జి.వి.ప్రకాష్ కుమార్ ఒక అదిరిపోయే సర్ప్రైజ్ అప్‌డేట్‌ను అందించారు.
ఈ సినిమాలో సూర్య ఒక ప్రత్యేకమైన మాస్ డ్యాన్స్ నంబర్ (పాట) పాడినట్లు జి.వి. ప్రకాష్ కుమార్ అధికారికంగా వెల్లడించారు. గతంలో 2014లో వచ్చిన ‘అంజన్’ (తెలుగులో సికందర్) చిత్రంలో ‘ఏక్ దో తీన్ చార్’ అనే పాటను సూర్య పాడారు. మళ్లీ దాదాపు 12 ఏళ్ల తర్వాత జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతంలో ఆయన మైక్ పట్టడం విశేషం. ‘యూత్’ సినిమాతో నటుడిగా, దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న కెన్ కరుణాస్ ఈ క్రేజీ డ్యాన్స్ నంబర్‌కు సాహిత్యం (లిరిక్స్) అందించారు. ఈ వార్తతో సూర్య అభిమానుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ స్పెషల్ సాంగ్‌ను వినడానికి ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమా బాలీవుడ్ స్టార్ రవీనా టాండన్, సీనియర్ నటి రాధిక శరత్‌కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకు సంబంధించిన పాటలను జూలై నెలలో విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ ప్రతిష్టాత్మక చిత్రాన్ని 2026 ఆగస్టు 14న స్వాతంత్ర్య దినోత్సవ కానుకగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో అత్యంత గ్రాండ్‌గా విడుదల కానుంది.
