
AK 47 Release Postponed: విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ఆదర్శ కుటుంబం ఏకే – 47’. ఇప్పటికే భారీ హైప్ తెచ్చుకున్న ఈ సినిమా రిలీజ్ విషయంలో ఊహించని ట్విస్ట్ ఎదురైంది. అక్టోబర్ 9న థియేటర్లలో సందడి చేయాల్సి ఉండగా.. తీరా రిలీజ్ టైం దగ్గర పడ్డాక లాస్ట్ మినిట్‌లో సినిమాను వాయిదా వేస్తున్నట్లు ప్రకటించి ప్రేక్షకులను, అభిమానులను తీవ్ర షాక్‌కు గురిచేశారు మేకర్స్.
హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో నిర్మాత సూర్యదేవర నాగవంశీ మాట్లాడుతూ రిలీజ్ వాయిదా విషయాన్ని అధికారికంగా వెల్లడించారు. మూడు నాలుగు రోజుల క్రితం వరకు కూడా అక్టోబర్ 9నే విడుదల చేయాలని గట్టిగా భావించామని, అందుకే విదేశాల్లో అడ్వాన్స్ బుకింగ్స్ సైతం ఓపెన్ చేశామని ఆయన స్పష్టం చేశారు. అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో కొన్ని రోజులు వెనకబడటంతో సినిమాను హడావుడిగా రిలీజ్ చేయడం ఇష్టం లేకనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించారు. ఈ సినిమా కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది.
