Site icon TeluguMirchi.com

Dacoit : క్రిస్మస్ నుంచి ఉగాదికి షిఫ్ట్.. ‘డకాయిట్’ కొత్త రిలీజ్ డేట్ లాక్!

Dacoit
Dacoit : యంగ్ హీరో అడివి శేష్ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘డకాయిట్’ (Dacoit) తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాడు. షానీల్ డియో దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా ప్రేమ, ప్రతీకారం కలగలిపిన ఇంటెన్స్ స్టోరీగా రూపుదిద్దుకుంటోంది. ఇందులో మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, బాలీవుడ్ నటుడు అనురాగ్ కశ్యప్ కీలక పాత్రలో కనిపించనున్నారు. లీడ్ క్యారెక్టర్స్‌ను పరిచయం చేసిన ఫైర్ గ్లింప్స్‌తో ఇప్పటికే ఈ సినిమా భారీ బజ్‌ను క్రియేట్ చేసింది. అయితే మొదట ఈ సినిమాను క్రిస్మస్ సందర్భంగా విడుదల చేయాలని నిర్ణయించారు, కానీ అడివి శేష్‌కు జరిగిన కాలు గాయంతో షూటింగ్ వాయిదా పడింది. దీంతో మేకర్స్ తాజాగా కొత్త విడుదల తేదీని ప్రకటించారు.

‘డకాయిట్’ 2026 మార్చి 19న ఉగాది సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్లు మేకర్స్ తెలిపారు. అడివి శేష్, మృణాల్‌ ఠాకూర్‌ ఇంటెన్స్ లుక్స్ లో కనిపించిన రిలీజ్ డేట్ పోస్టర్ అదిరిపోయింది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో రూపొందుతున్న ఈ సినిమాను సుప్రియా యార్లగడ్డ నిర్మిస్తుండగా, సునీల్ నారంగ్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెలుగు, హిందీ భాషల్లో ఒకేసారి విడుదల కానుంది.

Exit mobile version