Site icon TeluguMirchi.com

Ajith Kumar: ‘డేర్ డెవిల్’గా అజిత్ ఎంట్రీ.. టైటిల్ పోస్టర్‌తోనే భారీ హైప్!

Ajith Kumar

Ajith Kumar: తమిళ స్టార్ హీరో అజిత్ కుమార్ తన 64వ చిత్రంతో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి ‘డేర్ డెవిల్’ (Dare Devil) అనే పవర్‌ఫుల్ టైటిల్‌ను మేకర్స్ ఖరారు చేస్తూ అధికారిక పోస్టర్‌ను రిలీజ్ చేశారు. టైటిల్‌తో పాటు విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్‌ను సొంతం చేసుకుంటోంది. డైస్ థీమ్‌తో ప్రత్యేకంగా రూపొందించిన ఈ పోస్టర్ సినిమాపై ఆసక్తిని మరింత పెంచింది.

ఈ చిత్రానికి అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహిస్తుండగా, బ్రేవ్‌హార్ట్స్ బ్యానర్‌పై అజిత్ సతీమణి షాలిని నిర్మిస్తున్నారు. మ్యూజిక్ సెన్సెషన్ అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఇప్పటికే అజిత్–అధిక్ రవిచంద్రన్ కాంబినేషన్‌లో వచ్చిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇప్పుడు అదే కాంబోలో మరో సినిమా తెరకెక్కుతుండటంతో అభిమానుల్లో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం.. ఈ నెలాఖరులో సినిమా రెగ్యులర్ షూటింగ్ స్టార్ట్ కానుండగా, డిసెంబర్ నాటికి చిత్రీకరణను పూర్తి చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే నటీనటులు, విడుదల తేదీకి సంబంధించిన మరిన్ని వివరాలు వెల్లడించే అవకాశం ఉందట.

Exit mobile version