Site icon TeluguMirchi.com

Shankar-Ajith Kumar: ‘వేల్పారి’ని పక్కన పెట్టి అజిత్‌తో శంకర్ సినిమా.. ఇదే కారణమా?

Shankar Ajith Kumar

Shankar-Ajith Kumar: కోలీవుడ్‌లో మరో క్రేజీ కాంబినేషన్‌కు రంగం సిద్ధమవుతోందా? స్టార్ హీరో అజిత్ కుమార్, స్టార్ డైరెక్టర్ శంకర్ కలిసి పనిచేయబోతున్నారనే వార్తలు ప్రస్తుతం సినీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమా వస్తే అది భారీ స్థాయిలో ఉండటం ఖాయమనే అంచనాలు మొదలయ్యాయి. ప్రస్తుతం శంకర్ ‘డేర్ డెవిల్’ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్లు సమాచారం. ఈ సినిమా తర్వాత అజిత్‌తో ఓ భారీ చిత్రాన్ని తెరకెక్కించేందుకు ఆయన ప్లాన్ చేస్తున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను ‘వేల్పారి’ కంటే ముందుగా పట్టాలెక్కించే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

శంకర్ గత చిత్రాలు ‘ఇండియన్ 2’, ‘గేమ్ ఛేంజర్’ ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయిన నేపథ్యంలో.. తదుపరి ప్రాజెక్ట్ విషయంలో ఆయన మరింత జాగ్రత్తగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ‘వేల్పారి’ కథ భారీ స్థాయిలో తెరకెక్కాల్సి ఉండటంతో నిర్మాణ వ్యయం కూడా భారీగా ఉంటుందని సమాచారం. ఈ కారణంగానే ఈ ప్రాజెక్ట్‌లో పెట్టుబడి పెట్టేందుకు నిర్మాతలు కొంత వెనుకంజ వేస్తున్నట్లు కోలీవుడ్‌లో చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో అజిత్‌తో సినిమా చేయడం ద్వారా ముందుగా ఓ భారీ ప్రాజెక్ట్‌ను పూర్తి చేయాలని శంకర్ భావిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే అజిత్-శంకర్ కాంబినేషన్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ కాంబినేషన్ నిజమైతే తమిళ సినీ పరిశ్రమలోనే కాకుండా సౌత్ ఇండియా వ్యాప్తంగా ఈ ప్రాజెక్ట్‌పై భారీ అంచనాలు ఏర్పడే అవకాశం ఉంది. ‘వేల్పారి’ కంటే ముందు అజిత్‌తో శంకర్ సినిమా చేస్తారా? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

Exit mobile version