
Akhanda 2 Thaandavam : గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను పవర్ ఫుల్ కొలాబరేషన్ లో వస్తున్న మోస్ట్ అవైటెడ్ డివైన్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘అఖండ 2: తాండవం’ పై అంచనాలు రోజురోజుకు పెరుగుతున్నాయి. రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ఎం. తేజస్విని నందమూరి సమర్పిస్తున్నారు. థమన్ అందించిన ఫస్ట్ సింగిల్ ‘ది తాండవం’ ప్రోమో ఇప్పటికే సంచలన స్పందన తెచ్చుకోగా, ముంబై జుహూలోని PVR మాల్‌లో జరిగిన ఈవెంట్‌లో పూర్తి పాటను విడుదల చేశారు. బాలయ్య అఘోర అవతారంలో శివ తాండవం చేసే సన్నివేశాలను ప్రతిబింబించే ఈ పాటలో ప్రతి ఫ్రేమ్ దివ్య శక్తిని అనుభూతిపరచేలా ఉంది. థమన్ ట్రేడ్‌మార్క్ పెర్కషన్, స్కోర్ కలగలిపిన ఈ సౌండ్‌ట్రాక్ మళ్లీ ఆయన హై-వోల్టేజ్ కంపోజిషన్ రేంజ్‌ను చూపించింది.
శంకర్ మహదేవన్, కైలాష్ ఖేర్ శక్తివంతమైన వోకల్స్‌తో పాటకు మరింత డివైన్ ఎనర్జీ చేరింది. లిరిసిస్ట్ కళ్యాణ్ చక్రవర్తి పదాల్లో శివుని పరమ శక్తిని అలౌకికంగా అద్దారు. ఈ ఏడాదిలో అత్యంత ప్రభావవంతమైన డివోషనల్ సాంగ్‌గా నిలిచేలా ఈ పాట రూపుదిద్దుకుంది. చిత్రంలో సంయుక్త ముఖ్య పాత్రలో కనిపించగా, ఆది పినిశెట్టి పవర్‌ఫుల్ క్యారెక్టర్‌లో నటిస్తున్నారు. హర్షాలి మల్హోత్రా కీలక పాత్ర పోషిస్తున్నారు. సి. రాంప్రసాద్, సంతోష్ D Detakae సినిమాటోగ్రఫీ, తమ్మిరాజు ఎడిటింగ్, ఎఎస్ ప్రకాష్ ఆర్ట్ డైరక్షన్ నిర్వహిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ‘అఖండ 2: తాండవం’ డిసెంబర్ 5, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.
