Site icon TeluguMirchi.com

Akhil Akkineni: డబ్బు కాదు.. విలువలే నేర్పించారు.. అఖిల్ అక్కినేని ఆసక్తికర కామెంట్స్

Akhil Akkineni

Akhil Akkineni: ఇటీవల ‘లెనిన్’ సినిమాతో తన కెరీర్‌లో అత్యంత కీలక విజయాన్ని అందుకున్న అక్కినేని హీరో అఖిల్ అక్కినేని తాజాగా ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా కుటుంబ విలువలు, ఆస్తి, తన తండ్రి నాగార్జున గురించి అఖిల్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి.

ఇంటర్వ్యూలో మాట్లాడిన అఖిల్ తమ కుటుంబంలో డబ్బు కంటే విలువలకు ఎక్కువ ప్రాధాన్యం ఉందని తెలిపారు. “మా నాన్నగారు మాకు డబ్బు గురించి కాకుండా ప్రిన్సిపల్స్ నేర్పించారు. జీవితంలో ఎలా ఉండాలి, మనుషులను ఎలా గౌరవించాలి, కుటుంబ బంధాలను ఎలా కాపాడుకోవాలనే విషయాలనే ఎక్కువగా చెప్పారు” అని అన్నారు. ఆస్తి వివాదాలపై వస్తున్న ప్రచారాలపై కూడా అఖిల్ స్పందించారు. “మా నాన్నగారు ఉన్నంత వరకు నాకు, మా అన్నయ్య నాగ చైతన్యకు మధ్య ఆస్తి తగాదాలు వచ్చే ప్రశ్నే లేదు. ఎవరికేం ఇవ్వాలో, ఎలా నిర్ణయించాలో మా నాన్నగారికి పూర్తిగా తెలుసు. ఆ విషయంలో మాకు ఎలాంటి సందేహాలు లేవు” అని స్పష్టం చేశారు.

అఖిల్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ కొత్త చర్చకు దారితీశాయి. కుటుంబ బంధాలు, పరస్పర నమ్మకం, విలువలపై ఆయన వ్యక్తం చేసిన అభిప్రాయాలను అభిమానులు ప్రశంసిస్తున్నారు. ముఖ్యంగా అక్కినేని కుటుంబంలో ఆస్తి వివాదాలపై వస్తున్న ఊహాగానాలకు ఈ వ్యాఖ్యలు చెక్ పెట్టేలా ఉన్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు. కాగా, ‘లెనిన్’ విజయంతో మంచి జోష్‌లో ఉన్న అఖిల్ ప్రస్తుతం తన తదుపరి ప్రాజెక్ట్‌లపై దృష్టి సారించినట్లు సమాచారం. మరోవైపు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సినీ వర్గాల్లోనూ ఆసక్తికర చర్చకు కారణమయ్యాయి.

Exit mobile version