
Lenin 100 Crore: అఖిల్ అక్కినేని హీరోగా నటించిన యాక్షన్ డ్రామా ‘లెనిన్’. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకొని దూసుకుపోతుంది. రిలీజ్ అయిన ఫస్ట్ డే నుంచే ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందిన ఈ చిత్రం తాజాగా మరో అరుదైన మైలురాయిని అందుకుంది. ప్రపంచవ్యాప్తంగా రూ.100 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. ఈ సందర్భంగా మేకర్స్ సోషల్ మీడియాలో ప్రత్యేక పోస్టర్‌ను విడుదల చేస్తూ.. “The ROAR has reached 100 CRORE+ Worldwide Gross. A celebration that belongs to every audience member who stood by #LENIN” అంటూ అభిమానులకు స్పెషల్ థాంక్స్ చెప్పారు. దీంతో అఖిల్ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు జరుపుకుంటున్నారు.
‘లెనిన్’ చిత్రంలో అక్కినేని అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించగా, దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు ఈ చిత్రాన్ని అవుట్ అండ్ అవుట్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ అందించిన పాటలు, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ మరో ప్రధాన బలంగా నిలిచాయి. థియేటర్లలో విజయవంతంగా ప్రదర్శితమవుతున్న ఈ సినిమా రూ.100 కోట్ల గ్రాస్ క్లబ్‌లో చేరడంతో అఖిల్ కెరీర్‌లో మరో కీలక మైలురాయిగా నిలిచింది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ZEE5లో ఆగస్టు 14 నుంచి స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

