
Lenin postponed: అక్కినేని అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘లెనిన్’ (LENIN). తాజాగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో ఒక వార్త తెగ వైరల్ అవుతుంది. నిజానికి ఈ జూన్ నెలలో విడుదల కావాల్సిన చిత్రాల్లో అత్యంత క్రేజ్ ఉన్న ఈ సినిమా ఇదే. అయితే ఈ సినిమా ఇప్పుడు వాయిదా పడినట్లు సినీ సర్కిల్స్ లో గట్టిగా జోరుగా ప్రచారం జరుగుతుంది.
మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. అన్నీ కుదిరితే ఈ నెలలోనే థియేటర్లలో సందడి చేయాల్సి ఈ సినిమా.. కొన్ని అనివార్య కారణాల వల్ల అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రావడం లేదని తెలుస్తోంది. దీంతో అక్కినేని ఫ్యాన్స్‌కు వెయిటింగ్ తప్పేలా లేదు. తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమాను వచ్చే నెల అంటే జూలై చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని చిత్ర యూనిట్ టార్గెట్‌గా పెట్టుకుందట. దీనిపై మేకర్స్ నుంచి త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌తో కూడిన అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సమాచారం. నాగవంశీ – అక్కినేని నాగార్జున సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
