
Akhil Akkineni: అక్కినేని యంగ్ హీరో అఖిల్ అక్కినేని, గ్లామర్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘లెనిన్’ (Lenin). మురళి కిషోర్ అబ్బురు దర్శకత్వంలో పక్కా రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాపై టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు సంబంధించి అక్కినేని అభిమానుల్లో పూనకాలు తెప్పించే ఒక క్రేజీ అప్‌డేట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఇటీవల కింగ్ నాగార్జున ఈ సినిమా ఫస్ట్ కట్ (రఫ్ కాపీ) చూశారట. సినిమా చూసిన అనంతరం ఆయన ఎంతో ఎగ్జైట్ అయ్యారని సమాచారం. “ఈ సినిమా అఖిల్ కెరీర్‌లోనే ఒక బిగ్గెస్ట్ గేమ్ చేంజర్ అవుతుంది” అని నాగార్జున ప్రశంసల వర్షం కురిపించారని ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ఈ మూవీతో అఖిల్ సరికొత్త మేకోవర్‌తో, నెవర్ బిఫోర్ లుక్‌లో కనిపిస్తాడని, ఫ్యాన్స్ అస్సలు ఊహించని రేంజ్‌లో ఈ క్యారెక్టర్ ఉంటుందని కింగ్ అభిప్రాయపడ్డారట.
సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల రిలీజ్ చేసిన థర్డ్ సింగిల్ ‘సోల్ ఆఫ్ లెనిన్’ (Soul of Lenin) సాంగ్ సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ మెలోడీ సాంగ్ ఇప్పటికే యూట్యూబ్‌లో 6 మిలియన్లకు పైగా వ్యూస్ సాధించి చార్ట్‌బస్టర్‌గా నిలిచింది. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ను అక్కినేని నాగార్జున – సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నాగవంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అన్ని రకాల కమర్షియల్ ఎలిమెంట్స్‌తో రాబోతున్న ఈ రూరల్ యాక్షన్ డ్రామాను జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయబోతున్నారు. ప్రస్తుతం చిత్ర యూనిట్ ప్రమోషన్స్ స్పీడ్ పెంచింది. తాజాగా ఈ చిత్ర నిర్మాణ సంస్థ ఈ సినిమాకు సంబంధించిన సరికొత్త పోస్టర్‌ను ఎక్స్ వేదికగా రిలీజ్ చేసింది. మనోడు వస్తున్నాడు.. మార్క్ ది డేట్ అంటూ ఫ్యాన్స్‌లో జోష్ పెంచింది.
Mark the date – 26.JUNE.26 🎯#Lenin is coming to hit hard, move hearts and stay with you forever ❤️
The next biggest madness is loading ❤️🔥
MANODU VASTHUNNADU 🔥#LeninOnJune26th @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman… pic.twitter.com/V7ZJmb693U
— Sithara Entertainments (@SitharaEnts) June 9, 2026
