Site icon TeluguMirchi.com

Alpha Runtime: ‘ఆల్ఫా’ సెన్సార్ రిపోర్ట్ అవుట్.. ఆ సీన్స్ తీసేయాలంటూ సెన్సార్ బోర్డ్ సీరియస్ వార్నింగ్!

Alpha

Alpha Runtime: యష్ రాజ్ ఫిలింస్ (YRF) ప్రతిష్టాత్మక స్పై యూనివర్స్ నుంచి రాబోతున్న మొట్టమొదటి లేడీ ఓరియెంటెడ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ ‘ఆల్ఫా’ (Alpha). ప్రస్తుతం ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయిన విషయం తెలిసిందే. అలియా భట్, శర్వరీ వాగ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ తాజాగా సెన్సార్ (CBFC) బోర్డు ముందుకు వచ్చింది. సినిమాకు సెన్సార్ సభ్యులు ఈ చిత్రానికి ‘U/A 16+’ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. ఈ చిత్రంలో తీవ్రమైన హింస, యాక్షన్ సన్నివేశాలు ఉన్న కారణంగా సెన్సార్ బోర్డు కొన్ని కీలక మార్పులను, కట్‌లను సూచించింది.

ముఖ్యంగా సినిమాలో ఉన్న మల్టిపుల్ స్టాబింగ్ (కత్తులతో పొడిచే) విజువల్స్ మోతాదును తగ్గించాలని లేదా సవరించాలని ఆర్డర్ వేసింది. దీంతో పాటు సినిమాలో ఉపయోగించిన ఒక బూతు పదాన్ని పూర్తిగా తొలగించారు. అలాగే ప్రేక్షకులకు మరింత స్పష్టత కోసం చిత్రంలోని అన్ని పాటలకు సబ్‌టైటిల్స్ యాడ్ చేయాలని సీబీఎఫ్‌సీ సూచించింది. వీటితో పాటు డిస్క్లైమర్, ఎండ్ క్రెడిట్స్‌లో కొన్ని చిన్నపాటి మార్పులు చేశారు. ఈ మార్పులన్నీ పూర్తయిన తర్వాత ‘ఆల్ఫా’ చిత్రం ఫైనల్ రన్‌టైమ్‌ను 2 గంటల 20 నిమిషాల 48 సెకన్లుగా (140 నిమిషాలు) ఫిక్స్ చేశారు. ఒక పర్‌ఫెక్ట్ యాక్షన్ థ్రిల్లర్‌కు ఈ రన్‌టైమ్ ఎంతో క్రిస్ప్‌గా, గ్రిప్పింగ్‌గా ఉంటుందని ట్రేడ్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. శర్వరీ వాగ్, అలియా భట్ సూపర్ స్టెలిష్ ఏజెంట్లుగా కనిపించబోతున్న ఈ భారీ బడ్జెట్ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హృతిక్ రోషన్ ‘వార్’ ఫేమ్ సిద్ధార్థ్ ఆనంద్ నిర్మిస్తుండగా, శివ్ రవైల్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా జూలై 3న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది.

Exit mobile version