Site icon TeluguMirchi.com

12A Railway Colony : అల్లరి నరేష్ ’12A రైల్వే కాలనీ’ రిలీజ్ డేట్ ఫిక్స్!!

12a railway colony
12A Railway Colony : అల్లరి నరేష్ హీరోగా నటించిన తాజా చిత్రం ’12A రైల్వే కాలనీ’ నిర్మాణం పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. నాని కాసరగడ్డ దర్శకుడిగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో అల్లరి నరేష్ భిన్నమైన షేడ్స్‌తో కూడిన పాత్రలో కనిపించనున్నారు. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించిన ఈ చిత్రాన్ని పవన్ కుమార్ సమర్పించారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ ఈ సినిమాకు షోరన్నర్‌గా వ్యవహరిస్తూ కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్ అందించగా, పొలిమేర సిరీస్‌లో ఆకట్టుకున్న డాక్టర్ కామాక్షి భాస్కర్ల హీరోయిన్‌గా నటించారు. ఇటీవల విడుదలైన టైటిల్ టీజర్‌కు ప్రేక్షకుల నుండి అద్భుతమైన స్పందన రాగా, తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేసారు మేకర్స్.

’12A రైల్వే కాలనీ’ నవంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని మేకర్స్ తెలిపారు. రిలీజ్ డేట్ పోస్టర్‌లో అల్లరి నరేష్ డ్యాన్సర్స్‌తో కలిసి ఎనర్జిటిక్ డ్యాన్స్ ఫోజ్‌లో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. అంతేకాదు మేకర్స్ విడుదల చేసిన స్పెషల్ వీడియో ఆకట్టుకుంది. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తుండగా, సాయి కుమార్, వైవా హర్ష, గెటప్ శ్రీను, అనిష్ కురువిల్లా, మధుమణి వంటి ప్రముఖులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఇక త్వరలోనే మేకర్స్ భారీ ప్రమోషనల్ క్యాంపెయిన్ ప్రారంభించడానికి సిద్ధమవుతున్నారు.

Exit mobile version