Site icon TeluguMirchi.com

12A Railway Colony : ఉత్కంఠ రేపుతున్న అల్లరి నరేష్‌ ’12A రైల్వే కాలనీ’ ట్రైలర్‌!

12a railway colony
12A Railway Colony : అల్లరి నరేష్‌ హీరోగా నటించిన సైకలాజికల్‌ థ్రిల్లర్‌ ’12A రైల్వే కాలనీ’ ప్రస్తుతం భారీ హైప్‌ క్రియేట్‌ చేస్తోంది. శ్రీనివాస సిల్వర్ స్క్రీన్‌ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్న ఈ చిత్రంతో నాని కాసరగడ్డ దర్శకుడిగా అరంగేట్రం చేస్తున్నాడు. పోలిమేరా సిరీస్‌తో గుర్తింపు పొందిన డా. అనిల్‌ విశ్వనాథ్‌ ఈ చిత్రానికి షోరన్నర్‌గా వ్యవహరించడమే కాకుండా కథ, స్క్రీన్‌ప్లే, డైలాగ్స్‌ కూడా రచించారు. ఇక ఇప్పటికే ఆసక్తికరమైన ప్రమోషనల్‌ కంటెంట్‌, మిస్టరీతో నిండిన కథ ఈ సినిమాపై అంచనాలు పెంచగా, తాజాగా రిలీజైన ట్రైలర్‌ ప్రేక్షకుల్లో ఉత్కంఠను రేకెత్తిస్తోంది.

ట్రైలర్‌ సినిమాకు సరైన టోన్‌ సెట్‌ చేస్తూ థ్రిల్లింగ్‌ ఫీల్‌ను అందించింది. రహస్యమైన హత్యల నేపథ్యంలో సాగే కథలో ప్రతి పాత్ర అనుమానాస్పదంగా కనిపించడం, వాస్తవం – భ్రాంతి వంటి అంశాలు ప్రేక్షకుల ఆసక్తిని పెంచుతున్నాయి. అల్లరి నరేష్‌ ఈ సినిమాలో పూర్తిగా కొత్త అవతారంలో కనిపించబోతున్నారు. కామెడీ ఇమేజ్‌ నుంచి బయటపడి భయాలు, భావోద్వేగాలు, మానసిక ఒత్తిడితో కూడిన పాత్రలో అద్భుతమైన నటన కనబరిచారు. కామాక్షి భాస్కర్ల, సాయి కుమార్‌, వైవా హర్ష ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. భీమ్స్‌ సిసిరోలియో బ్యాక్‌గ్రౌండ్‌ స్కోర్‌, అద్భుతమైన ప్రొడక్షన్‌ డిజైన్‌ సినిమా నాణ్యతను మరింతగా పెంచాయి. నవంబర్‌ 21న థియేటర్లలో విడుదల కానున్న ’12A రైల్వే కాలనీ’ మిస్టరీ, సస్పెన్స్‌, ఎమోషన్‌లతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధంగా ఉంది.

Exit mobile version