
Raaka First Glimpse: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ – సెన్సేషనల్ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఒక భారీ పాన్-ఇండియా చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ ప్రతిష్టాత్మకంగా చిత్రానికి ‘రాకా’ (#RAAKA) అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఈ చిత్రం హై-వోల్టేజ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న సమాచారం. తాజాగా ఈ సినిమా ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్‌కు సంబంధించి సినీ సర్కిల్స్‌లో వార్త జోరుగా ప్రచారంలో ఉంది. అన్నీ అనుకున్నట్లుగా జరిగితే, వచ్చే ఆగస్ట్‌లో ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్‌ను గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఈ గ్లింప్స్ ద్వారా సినిమా స్కేల్, అట్లీ విజన్ ఏ రేంజ్‌లో ఉండబోతోందో ప్రేక్షకులకు ఒక విజువల్ ట్రీట్ ఇవ్వనున్నారట.
సన్ పిక్చర్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె హీరోయిన్‌గా నటిస్తుండగా.. మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్ కీలక పాత్రల్లో కనిపించనున్నారని టాక్. ఈ చిత్రానికి సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో అల్లు అర్జున్ గతంలో ఎన్నడూ చూడని సరికొత్త అవతారంలో కనిపించబోతున్నారనే వార్తలతో ఈ సినిమాపై అంచనాలు స్కై హైకి చేరాయి. మరి ఆగస్ట్‌లో రాబోయే ఈ క్రేజీ అప్‌డేట్‌పై అధికారిక ప్రకటన ఎప్పుడు వస్తుందో చూడాలి.
