
AA23 Movie Update: పాన్ ఇండియా బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించేందుకు ఒక క్రేజీ కాంబినేషన్ రెడీ అవుతుంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, కోలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో రాబోతున్న మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్ ‘AA23’ ఇప్పుడు ఫాస్ట్ ట్రాక్ మోడ్‌లోకి వచ్చేసిందని సమాచారం. ఈ సినిమాకు సంబంధించిన పనులు దసరా పండుగ తర్వాత శరవేగంగా స్టార్ట్ కానున్నట్లు ఫిలిం నగర్ వర్గాల సమాచారం.
హైదరాబాద్‌లో ప్రీ-ప్రొడక్షన్ పనులు షురూ..
ప్రస్తుతం అల్లు అర్జున్ ‘రాకా’ (Raaka) షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక షెడ్యూల్స్ పూర్తికాగానే, ఆయన నేరుగా లోకేష్ కనగరాజ్ ప్రాజెక్ట్‌లోకి అడుగుపెట్టనున్నారని సమాచారం. దీంతో ఈ గ్యాప్‌లో సినిమా స్క్రిప్ట్ వర్క్, ప్రీ-ప్రొడక్షన్ పనులను పూర్తి చేయడానికి డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ తన బేస్‌ను తాత్కాలికంగా హైదరాబాద్‌కు మార్చినట్లు టాక్. ప్రస్తుతం హైదరాబాద్‌లోనే ఉంటూ స్క్రిప్ట్ ఫైనల్ వెర్షన్‌ను లాక్ చేసే పనిలో ఆయన నిమగ్నమయ్యారని సమాచారం.
హై-వోల్టేజ్ కాస్టింగ్ వేట..
లోకేష్ కనగరాజ్ సినిమాల్లో విలన్ పాత్రలు ఎంత పవర్‌ఫుల్‌గా ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. అందుకే ‘AA23’ కోసం లోకేష్ మార్క్ ఇంటెన్స్ కలిగిన నటీనటుల వేట ఇప్పటికే ముమ్మరంగా సాగుతోంది. దసరా తర్వాత ఈ సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెబుతున్నారు. లోకేష్ కనగరాజ్ సినిమాటిక్ యూనివర్స్ (LCU) క్రేజ్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు ఉన్న పాన్-ఇండియా మార్కెట్ కలిస్తే బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు క్రియేట్ అవ్వడం ఖాయం ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఈ క్రేజీ కాంబో గనుక క్లిక్ అయితే, ఇది కేవలం సినిమా మాత్రమే కాదు.. ఇండియన్ బాక్సాఫీస్‌ను షేక్ చేసే ఒక బిగ్గెస్ట్ విజువల్ ట్రీట్ అవుతుందని సినీ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
