Site icon TeluguMirchi.com

Allu Arjun: హీరోయిన్ లేకుండా బన్నీ సినిమా? లోకేష్ ఏం వండుతున్నాడు!

Allu Arjun

Allu Arjun: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న క్రేజీ ప్రాజెక్ట్ ‘AA23’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ‘పుష్ప’ తర్వాత అల్లు అర్జున్ చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతూ అభిమానుల్లో ఆసక్తిని రేకెత్తిస్తుంది. లోకేష్ కనగరాజ్‌తో ఆయన కాంబోపై అభిమానుల్లో భారీ హైప్ క్రియేట్ అయ్యింది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రతో పాటు రొమాంటిక్ ట్రాక్ కూడా ఉండకపోవచ్చని ప్రచారం జరుగుతోంది. లోకేష్ కనగరాజ్ ఈ సినిమాను పూర్తిగా యాక్షన్, ఎమోషన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌తో నడిచే కథగా తెరకెక్కించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

ఇప్పటికే లోకేష్ కనగరాజ్ తెరకెక్కించిన ‘ఖైదీ’, ‘విక్రమ్’ వంటి చిత్రాల్లో హీరోయిన్, రొమాంటిక్ ట్రాక్‌కు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకుండా కథ, పాత్రల బలంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఇప్పుడు అదే తరహా ఫార్ములాను అల్లు అర్జున్ సినిమాకూ అనుసరిస్తున్నారనే ప్రచారం ఆసక్తిని పెంచుతోంది. ఈ వార్త నిజమైతే.. అల్లు అర్జున్ కెరీర్‌లో ‘AA23’ అత్యంత భిన్నమైన ప్రయోగంగా నిలిచే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. సాధారణంగా స్టార్ హీరోల సినిమాల్లో హీరోయిన్, లవ్ ట్రాక్, పాటలు ప్రధాన ఆకర్షణగా ఉంటాయి. కానీ వాటికి భిన్నంగా కేవలం కథ, యాక్షన్, హీరో క్యారెక్టరైజేషన్‌పై ఆధారపడి ఈ చిత్రాన్ని రూపొందించే ప్రయత్నం జరుగుతున్నట్లు సమాచారం. అయితే ‘AA23’లో హీరోయిన్ ఉండదనే వార్తపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమాతో పాటు, లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందనున్న ‘AA23’ లైన్లో పెట్టిన సంగతి తెలిసిందే.

Exit mobile version