Site icon TeluguMirchi.com

Anil Ravipudi: ఆదివారం కూడా సెలవు లేదట.. సంక్రాంతి కోసం అనిల్ రావిపూడి టీమ్ నాన్‌స్టాప్‌గా షూటింగ్!

Anil Ravipudi

Anil Ravipudi: టాలీవుడ్‌లో వరుస విజయాలతో దూసుకుపోతున్న దర్శకుడు అనిల్ రావిపూడి ప్రస్తుతం తన తదుపరి సినిమాను శరవేగంగా తెరకెక్కిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో చిత్రబృందం ఎలాంటి బ్రేక్ లేకుండా షూటింగ్ కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఆదివారాలు, సెలవులు అనే తేడా లేకుండా వరుస షెడ్యూల్స్‌తో సినిమా చిత్రీకరణ జరుగుతున్నట్లు సమాచారం. అనిల్ రావిపూడి సినిమాలకు కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అంశాలతో పాటు కమర్షియల్ హంగులు ప్రధాన బలంగా ఉంటాయి. ఈ నేపథ్యంలో ఆయన కొత్త చిత్రంపై కూడా ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవలే ఈ చిత్రం నుంచి విక్టరీ వెంకటేష్ ఫస్ట్ లుక్ పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ సినిమాలో వెంకీ మామా కల్నల్ వెంకట్ రెడ్డి అనే పవర్ ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారని మేకర్స్ రివీల్ చేశారు. షూటింగ్ స్టార్టింగ్ లో నే ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక ప్రేక్షకు ముందుకు తీసుకొస్తామని చెప్పారు. దీంతో చెప్పిన టార్గెట్ కి సినిమాను పూర్తి చేయడానికి చిత్ర బృందం వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

సినిమా షూటింగ్ వేగంగా జరుగుతున్నప్పటికీ క్వాలిటీ విషయంలో మాత్రం ఎక్కడా రాజీ పడటం లేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. డైరెక్టర్ అనిల్ రావిపూడితో పాటు నిర్మాణ సంస్థ కూడా ప్రతి సన్నివేశాన్ని అత్యుత్తమంగా తెరకెక్కించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు సమాచారం. ముఖ్యంగా సినిమా ప్రొడక్షన్ క్వాలిటీ, విజువల్ స్కేల్ విషయంలో భారీ స్థాయిని కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. షూటింగ్ నుంచి వస్తున్న అవుట్‌పుట్ కూడా అద్భుతంగా ఉందని చిత్రబృందానికి సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే తెరకెక్కించిన సన్నివేశాలు ఆశించిన దానికంటే మెరుగ్గా రావడంతో యూనిట్‌లో ఉత్సాహం మరింత పెరిగినట్లు సమాచారం. సంక్రాంతి బరిలో సినిమాను నిలబెట్టేందుకు అవసరమైన అన్ని పనులను ముందుగానే పూర్తి చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. సంక్రాంతి సీజన్ టాలీవుడ్‌లో అత్యంత కీలకమైన రిలీజ్ విండో కావడంతో అనిల్ రావిపూడి సినిమాకు కూడా ఈ విడుదల తేదీపై భారీ అంచనాలు ఉన్నాయి. పండుగ సీజన్‌కు సరిపోయేలా పూర్తి స్థాయి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నట్లు సమాచారం. షూటింగ్ వేగం, నిర్మాణ ప్రమాణాలు, క్వాలిటీ విషయంలో తీసుకుంటున్న జాగ్రత్తలను చూస్తే.. సంక్రాంతికి మరో బిగ్ హిట్ అందించాలనే లక్ష్యంతో అనిల్ రావిపూడి టీమ్ పనిచేస్తున్నట్లు స్పష్టమవుతోంది. క్రేజీ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో విక్టరీ వెంకటేష్ సరసన కీర్తి సురేష్ నటిస్తుండగా, నందమూరి కళ్యాణ్ రామ్ కృతి శెట్టి హీరోయిన్ గా కనిపించబోతున్నారు.

Exit mobile version