Paradha OTT: అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రలో నటించిన ఫీమేల్ ఓరియెంటెడ్ సోషల్ డ్రామా ‘పరదా’ త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా బండి, శుభం సినిమాలతో గుర్తింపు పొందిన దర్శకుడు ప్రవీణ్ కండ్రేగుల ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఆగస్టు 22న సినిమా విడుదల కానుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్ర డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫార్మ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. థియేటర్ రిలీజ్ తర్వాత నాలుగు నుంచి ఆరు వారాల్లో ఈ మూవీ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే అవకాశముంది.
ఈ సినిమాలో అనుపమతో పాటు దర్శన రాజేంద్రన్, రాగ్ మయూర్, సంగీత కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆనంద మీడియా బ్యానర్‌పై పీవీ శ్రీనివాసులు, శ్రీధర్ సంయుక్తంగా ఈ సినిమాను నిర్మించారు. ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో యంగ్ హీరో రామ్ పోతినేని మాట్లాడుతూ, “ఈ మూవీలో అనుపమ 2.Oను చూడబోతున్నారు” అని చెప్పడం హైలైట్ అయ్యింది.
కథ విషయానికి వస్తే-సుబ్బు అనే పల్లెటూరి అమ్మాయి జీవిత చుట్టూ ‘పరదా’ స్టోరీ తిరుగుతుంది. ఊరిలో ఉన్న కఠిన కట్టుబాట్లు, మగవారికే ఉన్న ప్రత్యేక హక్కులు చూసి విసిగిపోయిన ఆమె ఇద్దరు అపరిచితులతో ట్రిప్‌కి బయలుదేరుతుంది. అయితే ఆ ప్రయాణంలో సుబ్బు అదృశ్యం కావడం, ఊరిలో ఊహించని ప్రమాదం పొంచి ఉండడం ప్రధాన ట్విస్ట్‌గా కనిపిస్తోంది. అసలు సుబ్బు ఏ సమస్యను ఎదుర్కొంది? ఎందుకు ఆమెకు వ్యతిరేకంగా ఊరు మారింది? ‘పరదా’ వెనుక దాగి ఉన్న అవమానాలు, కట్టుబాట్లు ఏమిటి అన్నది సినిమాతోనే తెలుస్తుంది.

