
భారీ అంచనాల నడుమ విడుదలైన నందమూరి కల్యాణ్ రామ్ నటించిన ఎమోషనల్ యాక్షన్ డ్రామా అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి, ఏప్రిల్ 18న ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి ఓపెనింగ్ అందుకుంది. కళ్యాణ్ రామ్ హీరోగా, సీనియర్ నటి విజయశాంతి ప్రధాన పాత్రలో కనిపించిన ఈ సినిమా.. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి మంచి స్పందన పొందింది. తొలి రోజే సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ.5.15 కోట్లు గ్రాస్ కలెక్షన్ సాధించింది. ఈ మధ్యకాలంలో తెలుగు సినిమాలకు కొంత మేర తగ్గిన మాస్ క్రౌడ్‌ను తిరిగి థియేటర్లకు తీసుకొచ్చిన సినిమాగా అర్జున్ సన్ ఆఫ్ విజయంతి నిలిచింది. సినిమా లోని భావోద్వేగాలు, తల్లి-కొడుకు సెంటిమెంట్, పవర్‌ఫుల్ యాక్షన్ సన్నివేశాలు మరియు శాకింగ్ క్లైమాక్స్ మాస్ ఆడియెన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి, ముఖ్యంగా A నుండి D సెంటర్స్ వరకు మంచి స్పందన వస్తోంది. బారీ డిమాండ్ నేపథ్యంలో, నిర్మాతలు ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో అదనపు షోలు ఏర్పాటు చేస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి ప్రదీప్ చిలుకూరి దర్శకత్వం వహించగా, అశోక్ వర్ధన్ ముప్పా మరియు సునీల్ బాలుసు సంయుక్తంగా నిర్మించారు.
