Site icon TeluguMirchi.com

Atlee: “నీ టాలెంట్ వేరే లెవెల్”.. ఆ యంగ్ హీరోయిన్‌కు అట్లీ మైండ్ బ్లోయింగ్ సర్ప్రైజ్!

Atlee

Atlee: సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో దూసుకుపోతున్న యంగ్ అండ్ టాలెంటెడ్ బ్యూటీ ప్రీతి ముకుందన్‌పై స్టార్ డైరెక్టర్ అట్లీ ప్రశంసల వర్షం కురిపించారు. ఆమె నటన, ప్రతిభకు తాను ఫిదా అయ్యానంటూ అట్లీ చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం చిత్ర పరిశ్రమతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి.

అధర్వ మురళి, ప్రీతి ముకుందన్, ఫహద్ ఫాసిల్ కాయదు లోహర్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ఇదయం మురళి’. ఈ చిత్రం జూలై 10 న థియేటర్లలో విడుదల కానున్న ఈ చిత్రాన్ని తెలుగులో ‘హృదయం మురళి’ పేరుతో రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేకమైన కార్యక్రమంలో స్టార్ డైరెక్టర్ అట్లీ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. “ప్రీతి.. నీ డ్యాన్స్, యాక్టింగ్ స్టైల్ నాకు చాలా బాగా నచ్చాయి. నువ్వు అమేజింగ్. నిజం చెప్పాలంటే నా సినిమాలో ఒక పాత్ర కోసం నిన్ను సంప్రదించాను. కానీ నువ్వు ‘ఇదయం మురళి’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండటం వల్ల డేట్స్ సర్దుబాటు చేయలేకపోయానని చెప్పావు. నీ టాలెంట్, డెడికేషన్ నిజంగా వేరే లెవెల్” అని అట్లీ పేర్కొన్నారు.

అంతేకాకుండా, ‘ఇదయం మురళి’ సినిమాలో ప్రీతి పర్ఫార్మెన్స్ ఎక్స్‌ట్రార్డినరీగా ఉందన్న అట్లీ.. ఆమె త్వరలోనే దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుని ‘నేషనల్ క్రష్’ అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు. సాక్షాత్తూ స్టార్ డైరెక్టర్ అట్లీ నుంచి ఇలాంటి ప్రశంసలు దక్కడంతో ప్రీతి ముకుందన్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఈ అభినందనలు ఆమె కెరీర్‌కు పెద్ద ప్లస్ అవుతాయని, భవిష్యత్తులో ఆమె స్టార్ హీరోయిన్‌గా ఎదగడం ఖాయమని సినిమా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం అట్లీ చేసిన ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.

Exit mobile version