Site icon TeluguMirchi.com

Dada Shooting Update: బాలయ్య ‘దాదా’ షూటింగ్ ప్లాన్ ఇదే.. అక్టోబర్‌లో స్టార్ట్, డిసెంబర్ 24న గ్రాండ్ రిలీజ్!

NBK111

Dada Shooting Update: నట సింహం నందమూరి బాలకృష్ణ, డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీపై NBK111 పై ప్రేక్షకులతో పాటు ట్రేడ్ వర్గాల్లోనూ రోజురోజుకూ ఆసక్తి పెరుగుతోంది. ఈ సినిమాకు మేకర్స్ ‘దాదా’, ‘GOD’ అనే టైటిల్స్‌ను పరిశీలిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించిన ఓ ఆసక్తికరమైన అప్‌డేట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అక్టోబర్ మొదటి వారం నుంచి ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి స్టార్ట్ చేసి, పెండింగ్ షూట్‌ను వేగంగా కంప్లీట్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. ఇక నవంబర్ మొదటి వారంలో బాలకృష్ణ షూటింగ్‌లో జాయిన్ అవుతారని టాక్ వినిపిస్తోంది. బాలయ్యకు సంబంధించిన షూటింగ్ పార్ట్ పెద్దగా పెండింగ్ లేదని, కేవలం 25 నుంచి 30 రోజుల వర్క్ మాత్రమే బ్యాలెన్స్ ఉందని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఇటీవల యాక్షన్ సీక్వెన్స్ చిత్రీకరణ సమయంలో బాలకృష్ణకు గాయం కావడంతో షూటింగ్‌కు బ్రేక్ పడిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనకు శస్త్రచికిత్స జరగడంతో కొంతకాలం విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అయితే డిసెంబర్‌లో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే లక్ష్యంతో షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగంగా పూర్తి చేయాలని మేకర్స్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ చిత్రాన్ని డిసెంబర్ 24న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలయ్యకు సంబంధించిన షూటింగ్‌ను నవంబర్‌లో పూర్తి చేసి, మిగిలిన ప్యాచ్ వర్క్, పోస్ట్ ప్రొడక్షన్ పనులను సమాంతరంగా పూర్తి చేసేలా చిత్ర బృందం ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గోపీచంద్ మలినేని డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ఈ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో బాలకృష్ణకు జోడీగా కాజల్ అగర్వాల్ నటిస్తున్నారు. మంచు మనోజ్ కీలక పాత్రలో కనిపించనున్నారు. వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు.

Exit mobile version