Site icon TeluguMirchi.com

Balakrishna: గాయం.. ఆపరేషన్.. అయినా వెనక్కి తగ్గని బాలయ్య..!

Balakrishna

Balakrishna: నందమూరి బాలకృష్ణ కమిట్‌మెంట్ గురించి సినీ పరిశ్రమలో తరచూ చర్చ జరుగుతుంటుంది. తాజాగా షూటింగ్ సందర్భంగా ఆయనకు గాయమై, హైదరాబాద్‌లో ఆపరేషన్ జరిగినప్పటికీ సినిమా పనుల విషయంలో మాత్రం ఏమాత్రం రాజీ పడలేదని ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం రెస్ట్ మోడ్‌లో ఉన్న బాలయ్య తన ఆరోగ్య పరిస్థితి, షూటింగ్‌కు తిరిగి హాజరయ్యే విషయం, మిగిలిన షూటింగ్ షెడ్యూల్‌పై చిత్ర బృందంతో ఇప్పటికే చర్చించినట్లు తెలుస్తోంది. తాను సెట్స్‌లోకి వచ్చే వరకు తనతో సంబంధం లేని అన్ని సన్నివేశాలను పూర్తి చేయాలని దర్శక నిర్మాతలకు సూచించినట్లు సమాచారం. దీంతో సినిమా పనులు ఎక్కడా ఆగిపోకుండా ముందుగానే ప్లానింగ్ చేసినట్లు టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా ఈ చిత్రాన్ని డిసెంబర్ మూడో వారంలోనే విడుదల చేయాలనే లక్ష్యంతో బాలయ్య ఉన్నారని సినీ వర్గాలు చెబుతున్నాయి. అవసరమైతే రిలీజ్‌ను జనవరి లేదా ఫిబ్రవరికి వాయిదా వేసే అవకాశం ఉన్నప్పటికీ, ముందుగా అనుకున్న షెడ్యూల్‌ను మార్చొద్దని యూనిట్‌కు ఆయన స్పష్టం చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బాలయ్య క్రమశిక్షణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతిరోజూ తెల్లవారుఝామునే నిద్రలేచి యోగా, పూజలు చేసే అలవాటు ఉన్న ఆయన ఇటీవల జరిగిన ఆపరేషన్ కారణంగా తన పనితీరును మార్చుకోవడానికి సిద్ధంగా లేరని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. అయితే బాలకృష్ణ ఆరోగ్య పరిస్థితి, షూటింగ్‌లో తిరిగి ఎప్పుడు పాల్గొంటారు, సినిమా రిలీజ్ తేదీపై చిత్ర బృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు.

Exit mobile version