
Bellamkonda Ganesh : తెలుగు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుడు కరుణాకరన్. పవన్ కళ్యాణ్ నటించిన ‘తొలిప్రేమ’తో సంచలనం సృష్టించిన ఆయన, తరువాత బాలు, డార్లింగ్ వంటి చిత్రాలతో కూడా మంచి విజయాలు సాధించారు. ఇప్పుడు అదే దర్శకుడితో బెల్లంకొండ కుటుంబం కొత్త కాంబినేషన్ రాబోతోంది. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ, తన తమ్ముడు బెల్లంకొండ గణేష్ బాబు హీరోగా, కరుణాకరన్ దర్శకత్వంలో సినిమా రూపొందబోతుందని వెల్లడించారు.
ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ – “నాకు కరుణాకరన్ దర్శకత్వంలో లాంచ్ అవ్వాలన్న కోరిక ఉంది. అది అప్పట్లో సాధ్యంకాలేదు. కానీ ఇప్పుడు నా తమ్ముడు గణేష్ బాబుతో అదే దర్శకుడు సినిమా చేయబోతుండటం నాకు చాలా ఆనందంగా ఉంది” అని పేర్కొన్నారు. ఇక గణేష్ బాబుతో కరుణాకరన్ తెరకెక్కించే ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది? ఏ జానర్‌లో ఉంటుంది? అనే ఆసక్తికర విషయాలపై త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది.
