Site icon TeluguMirchi.com

Bhairavam : జీ5 లో ‘భైరవం’ దూకుడు – 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్‌తో డిజిటల్ బ్లాక్‌బస్టర్!

Bhairavam
Bhairavam : వైవిధ్యమైన కంటెంట్‌తో భారతదేశంలో ఓటీటీ ప్రేక్షకుల అభిమానం గెలుచుకున్న జీ5, మరో మేజర్ హిట్‌తో ముందుకు దూసుకెళ్తోంది. మే 30న థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకున్న ‘భైరవం’ సినిమా జూలై 18 నుంచి జీ5 ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. విడుదలైన తొలిదినం నుంచే మంచి టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఇప్పుడు డిజిటల్ వేదికపై రికార్డులు నెలకొల్పుతోంది. ఇప్పటికే 100 మిలియ‌న్ స్ట్రీమింగ్ మినిట్స్‌ను దాటి భైరవం ఓటీటీ ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటోంది.

బెల్లంకొండ శ్రీనివాస్, నారా రోహిత్‌, మంచు మనోజ్ ముఖ్య పాత్రల్లో నటించిన ఈ సినిమాలో ఆనంది శంకర్‌, దివ్యా పిళ్లై తదితరులు కీలక పాత్రల్లో మెప్పించారు. గ్రామ ఆలయ భూములపై ఓ రాజకీయ నేత కన్నేస్తే, ముగ్గురు స్నేహితుల జీవితాల్లో ఏవిధంగా కల్లోలం ఏర్పడిందన్న కథాంశంతో సినిమా సాగుతుంది. స్నేహం, ప్రేమ, భావోద్వేగాలతో రూపొందిన ఈ చిత్రం విజ‌య్ కనకమేడల దర్శకత్వంలో రూపొందింది. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ, శ్రీచరణ్ పాకాల సంగీతం, చోటా కె. ప్రసాద్ ఎడిటింగ్ చిత్రానికి హైలైట్స్. ఇప్పుడే జీ5లో స్ట్రీమింగ్ అవుతున్న భైరవాన్ని మిస్ అవ్వకండి!

Exit mobile version