
Bhairavam OTT : బెల్లంకొండ శ్రీనివాస్, మంచు మనోజ్, నారా రోహిత్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘భైరవం’ జూలై 18న ZEE5లో స్ట్రీమింగ్‌కు రానుంది. విజయ్ కనకమేడల దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 30న థియేటర్లలో విడుదలై మంచి స్పందన అందుకుంది. ఆదితి శంకర్, దివ్యా పిళ్లై, ఆనంది వంటి నటులు కీలక పాత్రలు పోషించారు. థియేటర్ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటీటీ వీక్షకులను మెప్పించేందుకు సిద్ధమవుతోంది.
భైరవం కథ ప్రాముఖ్యంగా ఒక దేవస్థాన భూముల చుట్టూ తిరుగుతుంది. వేల కోట్లు విలువైన వారాహి అమ్మవారి ఆలయ భూమిని కొంతమంది రాజకీయ నాయకులు కబ్జా చేయాలని చూస్తారు. ఆ భూమిని రక్షించేందుకు ముగ్గురు హీరోలు కలిసి చేసే ప్రయత్నాలే ఈ సినిమా మెయిన్ హైలైట్. కథలో ప్రతి పాత్రకు ఓ ప్రత్యేకత ఉంది. హరి కె వేదాంతం సినిమాటోగ్రఫీ, శ్రీ చరణ్ పాకాల సంగీతం, చోటా కె ప్రసాద్ ఎడిటింగ్ సినిమాకు పెద్ద ప్లస్ పాయింట్లుగా నిలిచాయి. తెలుగు మరియు హిందీ భాషల్లో కూడా ఈ సినిమా అందుబాటులో ఉండనుంది.
