Site icon TeluguMirchi.com

Bun Butter Jam : అన్‌స్టాపబుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ‘బన్ బటర్ జామ్’ టీజర్ విడుదల.. ఆగస్టు 8న థియేటర్లలో

Bunbutterjam
Bun Butter Jam : రాజు జెయమోహన్, ఆధ్య ప్రసాద్, భవ్య త్రిఖ ప్రధాన పాత్రల్లో నటించిన ఫన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘బన్ బటర్ జామ్’ త్వరలో తెలుగులో విడుదల కానుంది. రాఘవ్ మిర్దత్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తమిళంలో సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు అదే సినిమాను తెలుగులో ఆగస్టు 8న శ్రీ విఘ్నేశ్వర ఎంటర్టైన్‌మెంట్స్ బ్యానర్‌పై సిహెచ్. సతీష్ కుమార్ విడుదల చేస్తున్నారు.

ఈ సందర్భంగా చిత్ర టీజర్‌ను ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ మెహర్ రమేష్ రిలీజ్ చేసి, టీంకు శుభాకాంక్షలు తెలిపారు. టీజర్ చూస్తే తల్లిదండ్రులు తమ కొడుకు గొప్పతనాన్ని గురించి ఫోన్‌లో చెబుతూ కనిపిస్తారు. అలాగే హీరో పాత్రను ఫన్నీగా చూపించగా, హీరోయిన్‌తో ఉన్న ప్రేమకథ కూడా వినోదాత్మకంగా మలిచారు. అన్‌స్టాపబుల్ కామెడీ, సున్నితమైన ఎమోషన్ ఈ సినిమాకు హైలైట్‌గా నిలవనుంది.

దర్శకుడు రాఘవ్ మిర్దత్ తన ప్రత్యేక హాస్య శైలితో రూపొందించిన ఈ సినిమా సురేష్ సుబ్రమణియన్ సమర్పణలో, రెయిన్ ఆఫ్ ఎరోస్ బ్యానర్‌పై నిర్మితమైంది. సంగీత దర్శకుడు నివాస్ కె. ప్రసన్న స్వరాలు అందించగా, బాబు కుమార్ సినిమాటోగ్రఫీ అందించారు.

Exit mobile version