Site icon TeluguMirchi.com

Chennai Love Story: రిలీజ్‌కు ముందే లాభాల్లో ‘చెన్నై లవ్ స్టోరీ’.. ప్రీ-రిలీజ్ బిజినెస్‌తో కిరణ్ అబ్బవరం హాట్!

Nag Ashwin

Chennai Love Story: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటిస్తున్న సరికొత్త రొమాంటిక్ ఎంటర్‌టైనర్ ‘చెన్నై లవ్ స్టోరీ’. ఈ సినిమా రిలీజ్‌కి ముందే టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ-రిలీజ్ బిజినెస్‌కు సంబంధించి బయటకు వస్తున్న వార్తలు ఇండస్ట్రీ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ మూవీ థియేట్రికల్‌తో పాటు నాన్-థియేట్రికల్ రైట్స్ ద్వారా దాదాపు రూ.35 కోట్ల బిజినెస్ పూర్తి చేసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీంతో నిర్మాతలు ఇప్పటికే తమ పెట్టుబడిని రికవరీ చేసుకున్నారనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వివరాలపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన బయటికి రాలేదు.

ఈ చిత్రానికి రవి నంబూరి దర్శకత్వం వహిస్తుండగా, హీరోయిన్‌గా శ్రీ గౌరీ ప్రియా నటిస్తున్నారు. ప్రేమ, భావోద్వేగాలు, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన పోస్టర్లు, టీజర్, పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగిస్తుంది. ముఖ్యంగా యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో సినిమా తెరకెక్కిందని సినీ వర్గాలు చెబుతున్నాయి. జూలై 24న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానున్న ఈ సినిమాపై రోజురోజుకూ అంచనాలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం కిరణ్ అబ్బవరం చిత్రబృందంతో కలిసి ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు. ఇప్పటికే ప్రీ-రిలీజ్ బిజినెస్ పరంగా మంచి క్రేజ్ సంపాదించుకున్న ‘చెన్నై లవ్ స్టోరీ’, విడుదల తర్వాత కూడా బాక్సాఫీస్ వద్ద అదే జోరును కొనసాగిస్తుందా అనే ఆసక్తి సినీ అభిమానుల్లో నెలకొంది.

Exit mobile version