Site icon TeluguMirchi.com

China Piece Teaser : ‘చైనా పీస్’ టీజర్ చాలా నచ్చింది – నిహాల్ సినిమాపై సందీప్ కిషన్ ప్రశంసలు!

Chinapiece
China Piece Teaser : నిహాల్ కోధాటి, సూర్య శ్రీనివాస్ హీరోలుగా అక్కి విశ్వనాథ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన యూనిక్ స్పై డ్రామా ‘చైనా పీస్’ టీజర్‌ను మేకర్స్ ఈరోజు విడుదల చేశారు. మూన్ లైట్ డ్రీమ్స్ బ్యానర్‌పై రూపొందిన ఈ చిత్రంలో కమల్ కామరాజు, రఘు బాబు, రంగస్థలం మహేష్, శ్రీనివాస్ వడ్లమాని, శ్రీకాంత్ అయ్యంగార్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై మంచి బజ్‌ను క్రియేట్ చేయగా, తాజాగా విడుదలైన టీజర్ యాక్షన్, హ్యూమర్, థ్రిల్, యూనిక్ ప్రెజెంటేషన్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ టీజర్‌ను పీపుల్ స్టార్ సందీప్ కిషన్ ప్రత్యేక అతిథిగా హాజరై లాంచ్ చేశారు.

ఈ సందర్భంగా సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “అందరికీ నమస్కారం. ఈవెంట్ తో మీ అందరిని కలవడం చాలా ఆనందంగా ఉంది. టీమ్ అందరితో కలిసి ఈ టీజర్ ని సెలబ్రేట్ చేసుకోవడం వెరీ హ్యాపీ. నిహాల్ టీజర్ పంపాడు, చాలా నచ్చింది. అతని స్పష్టత, సినిమాపై ఉన్న నమ్మకం చాలా ఇంప్రెస్ చేసింది. చైనా పీస్ కేవలం స్పై థ్రిల్లర్ మాత్రమే కాదు, స్పై కామెడీ కూడా ఉంది. దర్శకుడు కథనాన్ని నమ్మి చిత్రీకరించారు. నిహాల్, సూర్యలలో నిజాయితీ కనిపిస్తోంది. కొత్త వాళ్ల ఆలోచనలను చూసేందుకు ప్రేక్షకులంతా థియేటర్‌కి రావాలి. ఒక సినిమాను నిర్మించి రిలీజ్ చేయడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు నచ్చితే అది అదనపు బోనస్ అన్నారు. టీమ్ అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. టీజర్ చాలా బాగుంది. సినిమా కూడా చాలా బాగుంటుందని కోరుకుంటున్నా” అన్నారు.

డైరెక్టర్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఈ వేడుకకు వచ్చిన సందీప్ కిషన్ గారికి ధన్యవాదాలు. మేము చాలా ఫ్యాషన్ తో ఈ సినిమాని క్రియేట్ చేశాను. కమల్ గారు కూడా ఈ సినిమాకి చాలా కాంట్రిబ్యూట్ చేశారు. ఆయన ఎక్స్పీరియన్స్ ని మాతో షేర్ చేసుకున్నారు. ఒక దేశభక్తి సినిమా తీస్తూ చైనా పీస్ అనే పేరు పెట్టడం వెరీ చాలెంజింగ్. మేము అన్ని విభాగంలోనూ జాగ్రత్తలు తీసుకుని చాలా చక్కగా ఈ సినిమాని తీర్చిదిద్దాం. సినిమాని ఆడియన్స్ లోకి తీసుకెళ్లడానికి మీ అందరి సపోర్టు కావాలని కోరుకుంటున్నాను”అన్నారు.

హీరో నిహాల్ మాట్లాడుతూ.. “మా సినిమాని సపోర్ట్ చేయడానికి వచ్చిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు. నేను నటించిన ఒక సినిమా చూసి సందీప్ కిషన్ గారు నా భుజాన చేయవేసి చాలా చక్కగా చేశావని మెచ్చుకున్నారు. ఆ క్షణం నేను మర్చిపోలేను. కష్టపడి సినిమాలు చేస్తే కచ్చితంగా సక్సెస్ వస్తుందనే దానికి సందీప్ కిషన్ గారు నిదర్శనం. తప్పకుండా ఆయనే మా సినిమా టీజర్ ని రిలీజ్ చేయాలని నేను బలంగా కోరుకున్నాను. ఆయన ఈ లాంచ్ రావడం నాకు చాలా గొప్ప ఆనందాన్ని ఇచ్చింది. నేను జగడంతో పాటు దాదాపు 20 సినిమాలు కి చైల్డ్ ఆర్టిస్ట్ గా వర్క్ చేశాను. అవన్నీ కూడా స్కూల్ బంక్ కొట్టడానికి చేశాను. కానీ యాక్టింగ్ అంటే మజా వచ్చింది. ఒక నమ్మకంతో మళ్లీ సినిమా ఇండస్ట్రీలోకి వచ్చాను. సినిమా చేతికి రావడానికి రెండేళ్లు పట్టింది. నిజంగా కలలుకని దానికి 100% కష్టపడితే గొప్ప పనులన్నీ జరుగుతాయనే నమ్మకం కుదిరింది. ఒక్కొక్క సినిమా ఒక కొత్త వాయిస్ ని తీసుకురావాలి. డైరెక్టర్ విశ్వనాథ్ ఈ సినిమాతో అలాంటి ఒక కొత్త వాయిస్ ని తీసుకొస్తారు. తనకు కావాల్సింది వచ్చేంతవరకు ఎక్కడ రాజీపడరు. గ్రేట్ రైటింగ్ స్ట్రాంగ్ ఎమోషన్స్ తో ఒక సాలిడ్ కమర్షియల్ సినిమాలో ఎన్ని ఎలిమెంట్స్ ఉండాలో అన్ని రకాల ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉన్నాయి. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

హీరో సూర్య శ్రీనివాస్ మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. సందీప్ కిషన్ గారికి థాంక్యూ సో మచ్. విశ్వనాథ్ గారికి ధన్యవాదాలు. ఈ సినిమా మాట్లాడుతుంది మీ అందరికీ నచ్చుతుంది. బాగా రీచ్ అవుతుందని నమ్మకం ఉంది. నిహాల్ కి థాంక్యూ వెరీ మచ్. ఈ సినిమాలో పనిచేసిన అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు” అన్నారు.

యాక్టర్ కమల్ కామరాజు మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. విశ్వనాథ్ చాలా క్లియర్ విజయంతో ఉన్నాడు. తను చాలా పరిణీతితో ఈ సినిమాని తీర్చిదిద్దాడు. ఈ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి మరో మంచి దర్శకుడు దొరికాడు. స్పై సినిమాలో ఉండాల్సిన అన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఇందులో ఉన్నాయి. సినిమా షూటింగ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నిహాల్ సూర్య అద్భుతంగా నటించారు. ఈ సినిమా తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

హర్షిత మాట్లాడుతూ.. “అందరికి నమస్కారం. ఈ సినిమాలో సారా అనే క్యారెక్టర్ ని ప్లే చేస్తున్నాను. పర్ఫామెన్స్ కి చాలా స్కోప్ ఉండే క్యారెక్టర్. ఇలాంటి క్యారెక్టర్ దొరకడం చాలా ఆనందంగా ఉంది. విశ్వనాధ్ రెడ్డి గారికి థాంక్యూ సో మచ్. నిహాల్, సూర్య అందరికీ థాంక్యూ సో మచ్. తప్పకుండా ఈ సినిమా మీ అందరికీ నచ్చుతుంది” అన్నారు.

దీక్ష పంత్ మాట్లాడుతూ.. “అందరికీ గుడ్ ఈవెనింగ్. చాలా రోజుల తర్వాత మళ్లీ స్క్రీన్ పైకి వచ్చినందుకు చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ విశ్వనాధ్ గారికి చాలా థ్యాంక్స్. ఈ సినిమాలో నేను చేసిన క్యారెక్టర్ ద్వారా మీ అందరికీ మళ్లీ నచ్చుతానని భావిస్తున్నాను. సందీప్ కిషన్ గారికి థాంక్యూ. టీజర్ చాలా ప్రామిస్ గా ఉంది. సినిమాని బ్యూటిఫుల్ గా తీశారు.తప్పకుండా మీరు అందరూ చాలా ఎంజాయ్ చేస్తారని కోరుకుంటున్నాను” అన్నారు.

Exit mobile version