Site icon TeluguMirchi.com

Pawan Kalyan : “దీర్ఘాయుష్మాన్ భవ కళ్యాణ్ బాబు”.. అన్నయ్య బర్త్‌డే విషెస్ వైరల్

Chiru pawan

మెగాస్టార్ చిరంజీవి తన సోదరుడు, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం మరియు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. పవన్ కళ్యాణ్‌తో ఉన్న ఓ ప్రత్యేక ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ చిరంజీవి తన అనుబంధాన్ని వ్యక్తం చేశారు. “చలనచిత్ర రంగంలో అగ్రనటుడిగా, ప్రజా జీవితంలో జనసేనానిగా, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా ప్రజలకు అంకితభావంతో సేవలందిస్తున్న పవన్ కళ్యాణ్ బాబుకి జన్మదిన శుభాకాంక్షలు. నీ సేవాస్ఫూర్తి చిరస్మరణీయం. ప్రజల ఆశీస్సులు, అభిమానంతో నిండిన నూరేళ్లు ఆయురారోగ్యాలతో కొనసాగాలని కోరుకుంటున్నాను. దీర్ఘాయుష్మాన్ భవ” అని మెగాస్టార్ తన సందేశంలో పేర్కొన్నారు. ఈ పోస్ట్ సోషల్ మీడియాలో క్షణాల్లోనే వైరల్ అవగా, పవన్ కళ్యాణ్‌తో చిరంజీవి షేర్ చేసిన ఫోటో అభిమానుల్లో ఆనందాన్ని నింపుతోంది. మెగాస్టార్ శుభాకాంక్షలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.

Exit mobile version