
Kaaka: మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ కొల్లి బాబీ కాంబోలో రూపొందుతున్న భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘కాకా’. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన బ్లాక్‌బస్టర్ సక్సెస్ తర్వాత మళ్లీ జతకట్టడంతో ఈ చిత్రంపై పరిశ్రమ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ హైప్ నెలకొంది. అయితే సాధారణంగా పెద్ద హీరోల చిత్రాల నిర్మాణం ఆఖరి నిమిషం దాకా సాగడం, పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో జాప్యం జరగడం చూస్తుంటాం. కానీ ‘కాకా’ విషయంలో మేకర్స్ అనుసరిస్తున్న బుల్లెట్ స్పీడ్ ఇప్పుడు టాలీవుడ్‌ను ఆశ్చర్యపరుస్తోంది.
రిలీజ్‌కి ఇంకా టైం ఉన్నప్పటికీ, మేకర్స్ అప్పుడే డబ్బింగ్ పనులను సైతం మొదలుపెట్టేసి తమ పక్కా ప్లానింగ్‌ను నిరూపించుకున్నారు. మూవీ డబ్బింగ్ ప్రక్రియను లాంఛనంగా స్టార్ట్ చేస్తూ పూజా కార్యక్రమాలకు సంబంధించిన ప్రత్యేక వీడియోను టీమ్ విడుదల చేసింది. ఈ అనూహ్య అప్‌డేట్‌తో మెగాస్టార్ సినిమా అనుకున్న సమయానికి థియేటర్లలోకి రావడం లాంఛనమేనని స్పష్టమైంది. ఎలాంటి తొందరపాటు లేకుండా, క్వాలిటీ విషయంలో రాజీ పడకుండానే పోస్ట్ ప్రొడక్షన్ పనులను ఇంత వేగంగా ట్రాక్‌లోకి తీసుకురావడం సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
ఈ సినిమాలో యువ హీరోయిన్ అనశ్వర రాజన్ అత్యంత కీలకమైన పాత్రలో కనిపించనుండగా, సంగీత సంచలనం ఎస్. థమన్ బాణీలు సమకూరుస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ కేవీఎన్ ప్రొడక్షన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 13న ‘కాకా’ ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కానుంది. తాజా డబ్బింగ్ అప్‌డేట్‌తో మెగా అభిమానుల్లో పండగ సందడి అప్పుడే స్టార్ట్ అయ్యింది.
