Site icon TeluguMirchi.com

Chiranjeevi Kaaka: అండర్‌ వరల్డ్ డాన్ ‘కదిరి కాళిదాస్’.. ‘కాకా’లో చిరు అసలు పాత్ర లీక్!

Kaaka

Chiranjeevi Kaaka: మెగాస్టార్ చిరంజీవి-బాబీ కొల్లి కాంబో రిపీట్ అవుతోందంటేనే మాస్ ఆడియన్స్‌లో ఎలాంటి అంచనాలు ఉంటాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. గతంలో ‘వాల్తేరు వీరయ్య’తో ఇండస్ట్రీ హిట్‌ను ఖాతాలో వేసుకున్న ఈ జోడి.. ఇప్పుడు ‘కాకా’ మూవీతో మరోసారి బాక్సాఫీస్ వేటకు సిద్ధమవుతోంది. అయితే, షూటింగ్‌లో ఎంతటి గోప్యత పాటించినా ‘చిరు లీక్స్’ ఆపడం ఎవరి వల్లా కాదనే విషయం మరోసారి రుజువైంది. ఇటీవల ఓ కార్యక్రమంలో సరదాగా మాట్లాడుతూనే.. సినిమాలో తన పాత్ర అసలు స్వరూపాన్ని మెగాస్టార్ స్వయంగా బట్టబయలు చేసేశారు. దీంతో మెగా అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పించే సర్ ప్రైజ్ దక్కింది. సినిమా టైటిల్ గ్లింప్స్‌లో చిరంజీవి పాత్రను ఒక ఆక్వా ఫ్యాక్టరీలో పనిచేసే ‘సత్యం’ అనే సాధారణ, బాధ్యతాయుతమైన ఉద్యోగిగా పరిచయం చేసిన సంగతి తెలిసిందే. కానీ, తెర వెనుక దాగి ఉన్న అసలు ట్విస్ట్ వేరే ఉందట. బయటి సమాజానికి ఎంతో నెమ్మదస్తుడిగా కనిపించే ఈ సత్యం వెనుక.. అండర్‌వరల్డ్‌ను గడగడలాడించిన మోస్ట్ వాంటెడ్ డాన్ ఉన్నాడని తెలుస్తోంది. ఆ పవర్‌ఫుల్ డాన్ పేరే ‘కదిరి కాళిదాస్’. ‘కాకా’ అంటే కేవలం టైటిల్ మాత్రమే కాదని, ‘కదిరి కాళిదాస్’ షార్ట్ ఫామ్ అని చిరంజీవి బయటపెట్టడంతో సోషల్ మీడియా మొత్తం ఊగిపోతోంది. ఈ డ్యూయల్ షేడ్ క్యారెక్టర్‌లో మెగాస్టార్ ఇచ్చే ఎలివేషన్లు, విధ్వంసకర యాక్షన్ ఎపిసోడ్లు మాస్ ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది.

ఈ చిత్రంలో కేవలం మాస్, గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మాత్రమే కాకుండా.. బలమైన ఎమోషనల్ డ్రైవ్ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. మెడిసిన్ చదివే గారాల కూతురు ‘అమ్ములు’ కోసం ప్రాణాలైనా అర్పించే తండ్రిగా చిరంజీవి కనిపించనున్నారు. మలయాళ యంగ్ హీరోయిన్ అనస్వర రాజన్ కూతురి పాత్రలో నటిస్తోంది. అండర్‌వరల్డ్‌నే ఏలిన క్రూరమైన కాళిదాస్.. అన్నీ వదిలేసి తన కూతురి కోసం ఒక సాధారణ ఫ్యాక్టరీ సూపర్‌వైజర్‌గా ఎందుకు బతకాల్సి వచ్చింది? తన పాత జీవితం మళ్లీ కూతురి ప్రాణాల మీదికి వస్తే ఆయన చూపించే విశ్వరూపం ఏంటి? అనే అంశాలే కథకు ప్రాణమని తెలుస్తోంది. కేవీఎన్ ప్రొడక్షన్స్ పతాకంపై అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు థమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ప్రస్తుతం కీలక షెడ్యూల్స్ జరుపుకుంటున్న ఈ మూవీని 2027 సంక్రాంతి బరిలో జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేటర్లలోకి తీసుకురానున్నారు. అండర్‌వరల్డ్ డాన్‌గా మెగాస్టార్ రీ-ఎంట్రీ ఇవ్వబోతున్నారనే న్యూస్ బయటకు రావడంతో వచ్చే సంక్రాంతికి బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

Exit mobile version