
Mana Shankara Vara Prasad Garu : మెగాస్టార్ చిరంజీవి హీరోగా, అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది. ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ ఒక ముఖ్య పాత్రలో నటిస్తున్నారు. నయనతార హీరోయిన్‌గా కనిపించనున్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై సాహు గారపాటి, సుష్మిత కొణిదెల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిరంజీవి గారు, ఫైటర్స్ బృందం పాల్గొనే క్లైమాక్స్ యాక్షన్ సీన్ చిత్రీకరణ జరుగుతోంది. ప్రముఖ యాక్షన్ కొరియోగ్రాఫర్ వెంకట్ మాస్టర్ పర్యవేక్షణలో తెరకెక్కుతున్న ఈ సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా గ్రాండ్‌గా తెరకెక్కుతున్నాయి.
ఇప్పటికే భీమ్స్ సిసిరోలియో అందించిన ఫస్ట్ సింగిల్ ‘మీసాల పిల్ల’ దేశవ్యాప్తంగా ట్రెండ్ అవుతోంది. సినిమాటోగ్రఫీ సమీర్ రెడ్డి, ఎడిటింగ్ తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్షన్ ఏ.ఎస్. ప్రకాష్ నిర్వహిస్తున్నారు. ఎస్.కృష్ణ, జి.ఆది నారాయణ కథా సహరచయితలు. 2026 సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమా, చిరంజీవి గారి చరిష్మా, అనిల్ రావిపూడి మాస్ అండ్ ఎమోషనల్ టచ్‌తో బిగ్గెస్ట్ ఎట్రాక్షన్‌గా నిలవనుంది.
