Site icon TeluguMirchi.com

Ram Charan: రామ్ చరణ్ కోసం అభిమాని చేసిన పని.. చిరంజీవిని కదిలించిన ఫ్యాన్ లవ్!

Ram Charan

Ram Charan: మెగాస్టార్ చిరంజీవి తన అభిమానిపై చూపించిన ఆప్యాయతకు సంబంధించిన ఓ అందమైన ఫ్యాన్ మూమెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. #Mega158 సినిమా డీవోపీ విభాగంలో పనిచేస్తున్న నివాస్‌ అనే టెక్నీషియన్‌ అంకితభావం, కష్టాన్ని చిరంజీవి ప్రశంసించారు. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య జరిగిన సంభాషణలో నివాస్‌ తన కుటుంబానికి సంబంధించిన ఓ ఆసక్తికరమైన విషయాన్ని మెగాస్టార్‌తో పంచుకున్నారు. తాను గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌కు వీరాభిమానినని నివాస్‌ చెప్పడంతో పాటు.. తన కుమారుడికి కూడా రామ్ చరణ్‌పై ఉన్న అభిమానంతో ‘జస్వంత్ రామ్ చరణ్’ అని పేరు పెట్టినట్లు వెల్లడించారు. ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఎంతో సంతోషించారు. తన కుమారుడిపై అభిమాని చూపిస్తున్న ప్రేమ, అభిమానాన్ని చూసి మెగాస్టార్ భావోద్వేగానికి గురైనట్లు సమాచారం.

రామ్ చరణ్‌పై నివాస్‌కు ఉన్న అభిమానాన్ని ప్రత్యేకంగా అభినందించిన చిరంజీవి.. అతడిని, అతని కుటుంబ సభ్యులను తన ఇంటికి ఆహ్వానించారు. అనంతరం నివాస్‌ కుటుంబంతో చిరంజీవి, రామ్ చరణ్ కలిసి గడిపిన అందమైన క్షణాలు అభిమానుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఓ అభిమాని తన కుమారుడికి రామ్ చరణ్ పేరు పెట్టుకునేంతగా అభిమానించడం, దానికి మెగాస్టార్ చిరంజీవి స్పందించిన తీరు మెగా అభిమానులను కదిలిస్తోంది. ప్రస్తుతం ఈ ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ‘ఇదే మెగా ఫ్యామిలీకి అభిమానులతో ఉన్న అనుబంధం’ అంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

Exit mobile version