Site icon TeluguMirchi.com

Dhruva Natchathiram: ‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌పై మళ్లీ నీలినీడలు.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించిన గౌతమ్ మీనన్!

Dhruva Natchathiram

Dhruva Natchathiram: తమిళ స్టార్ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ డైరెక్షన్‌లో విలక్షణ నటుడు విక్రమ్ ప్రధాన పాత్రలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ‘ధ్రువ నక్షత్రం’ (Dhruva Natchathiram) సినిమా రిలీజ్‌పై మరోసారి నీలినీడలు కమ్ముకున్నాయి. ఎన్నో ఏళ్లుగా ప్రేక్షకులు, విక్రమ్ అభిమానులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ స్పై థ్రిల్లర్ మూవీ మళ్లీ వాయిదా పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

గతంలో ఉన్న ఆర్థిక వివాదాల నేపథ్యంలో, ఈ చిత్రాన్ని 2026 జూన్ 15 లోపు రిలీజ్ చేసుకోవచ్చని మద్రాస్ హైకోర్టు అనుమతినిచ్చింది. అయితే చిత్ర యూనిట్ ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ, కోర్టు నిర్దేశించిన గడువు (జూన్ 15) లోగా ఈ సినిమాను థియేటర్లలోకి తీసుకురావడం అసాధ్యంగా మారిందని సమాచారం. ఈ మూవీ రిలీజ్‌కు మరికొంత సమయం అవసరం కావడంతో, దర్శకుడు గౌతమ్ వాసుదేవ్ మీనన్ మళ్లీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారట. ‘ధ్రువ నక్షత్రం’ రిలీజ్‌కు మరికొంత సమయం కావాలంటూ ఆయన కోర్టులో పిటిషన్ దాఖలు చేశారని సమాచారం. ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి జూలై 15, 2026 వరకు (మరో 30 రోజులు) గడువును పొడిగించాలని ఆయన ఆ పిటిషన్‌లో కోరారని టాక్.

గౌతమ్ మీనన్ దాఖలు చేసిన ఈ పిటిషన్ ఈ రోజు (సోమవారం) కోర్టు ముందుకు విచారణకు రానుందని సమాచారం. ఎన్నో ఏళ్లుగా ఈ సినిమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న విక్రమ్ అభిమానులకు.. ఈ తాజా పరిణామం కాస్త నిరాశ కలిగించే విషయమే. అయితే జూలై 15 నాటికైనా ఈ క్రేజీ ప్రాజెక్ట్ థియేటర్లలోకి వస్తుందా? లేదా అనేది కోర్టు ఇచ్చే తీర్పుపైనే ఆధారపడి ఉంటుంది. ఈ సినిమా రిలీజ్‌పై స్పష్టత రావడానికి మరికొద్ది రోజులు వెయిట్ చేయక తప్పేలా లేదని సమాచారం.

Exit mobile version