Site icon TeluguMirchi.com

Kriti Sanon: ఆ సినిమా లెస్బియన్‌ లవ్‌స్టోరీ కాదు.. రూమర్స్‌పై కృతి సనన్ క్లారిటీ!

Cocktail

Kriti Sanon: బాలీవుడ్ స్టార్ హీరో షాహిద్ కపూర్ హీరోగా, స్టార్ హీరోయిన్లు రష్మిక మందన్న, కృతి సనన్ కీ రోల్స్‌లో నటించిన మోస్ట్ అవేటెడ్ మూవీ ‘కాక్‌టెయిల్‌ 2’ (Cocktail 2). హోమీ అదజానియా డైరెక్షన్‌లో ఔట్ అండ్ ఔట్ ట్రయాంగిల్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం నేడు (జూన్ 19న) థియేటర్లలోకి వచ్చింది. అయితే, ఈ సినిమా రిలీజ్ అయిన నేపథ్యంలో గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక క్రేజీ రూమర్‌పై హీరోయిన్ కృతి సనన్ గట్టిగా స్పందించారు. ఈ సినిమాలో కృతి సనన్, రష్మిక మందన్నలు లెస్బియన్ కపుల్స్‌గా
కనిపించబోతున్నారంటూ నెట్టింట జోరుగా ప్రచారం సాగింది. తాజాగా చిత్ర ప్రమోషన్స్‌‌లో భాగంగా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో కృతి ఈ వార్తలను పూర్తిగా ఖండించారు.

వైరల్ అవుతున్న రూమర్లపై కృతి సనన్ స్పందిస్తూ.. “ఇది ఎలాంటి లెస్బియన్ లవ్‌స్టోరీ కాదు. కేవలం సోషల్ మీడియా ప్రచారాలు మాత్రమే. ఈ చిత్రం ముగ్గురు ప్రధాన పాత్రల జీవితాలు, వారి చుట్టూ తిరిగే పవర్‌ఫుల్ ఎమోషనల్ డ్రామా” అని స్పష్టం చేశారు. ఇదే ఇంటర్వ్యూలో పాల్గొన్న నేషనల్ క్రష్ రష్మిక మందన్న సైతం వారి మధ్య కెమిస్ట్రీ గురించి ఫన్నీగా రియాక్ట్ అయ్యారు. “మా ముగ్గురి (షాహిద్, కృతి, రష్మిక) మధ్య స్క్రీన్ కెమిస్ట్రీ చాలా అద్భుతంగా కుదిరింది. థియేటర్లలో సినిమా చూస్తున్నప్పుడు ప్రేక్షకులు కచ్చితంగా సర్‌ప్రైజ్ అవుతారు. ఎవరూ ఇలాంటి రూమర్స్ నమ్మొద్దు, నేరుగా థియేటర్లలోనే సినిమా చూసి ఎంజాయ్ చేయండి” అని రష్మిక కోరారు.

2012లో దీపికా పదుకొణె, డయానా పెంటి, సైఫ్ అలీ ఖాన్ ప్రధాన పాత్రల్లో నటించిన ‘కాక్‌టెయిల్‌’ సినిమా అప్పట్లో సంచలన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి సీక్వెల్‌గా షాహిద్ కపూర్, రష్మిక మందన్న, కృతి సనన్ నటించిన ‘కాక్‌టెయిల్‌ 2’ వస్తోంది. ఈ పార్ట్ 2 లో షాహిద్ కపూర్ తన కెరీర్‌లోనే ఇప్పటివరకు చేయని సరికొత్త వైవిధ్యమైన పాత్రలో కనిపించబోతున్నారని సమాచారం. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేస్తుందో చూడాలి.

Exit mobile version