Site icon TeluguMirchi.com

Committee Kurrollu : అవార్డుల వేటలో దూసుకెళ్తున్న ‘కమిటీ కుర్రోళ్లు’.. బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్ గా నిహారిక కొణిదెల

Committie kurrollu
Committee Kurrollu : పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్, శ్రీ రాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్లపై పద్మజ కొణిదెల, జయలక్ష్మి అడపాక నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్లు’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన తర్వాత అవార్డుల వేట మొదలుపెట్టింది. రూ.9 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం థియేట్రికల్‌గా రూ.18.5 కోట్లు, నాన్-థియేట్రికల్‌గా రూ.6 కోట్లు కలిపి మొత్తం రూ.24.5 కోట్ల వసూళ్లు రాబట్టింది.

నటిగా, నిర్మాతగా నిహారిక కొణిదెలకు ఈ చిత్రం కెరీర్‌లో ప్రత్యేక గుర్తింపు తెచ్చింది. ఇప్పటికే జాతీయ, రాష్ట్రస్థాయి అవార్డులు సొంతం చేసుకున్న ‘కమిటీ కుర్రోళ్లు’ తాజాగా గద్దర్ అవార్డుల్లోనూ, గామా అవార్డుల్లోనూ సత్తా చాటింది. గద్దర్ అవార్డ్స్‌లో జాతీయ సమైక్యత, మతసామరస్యం, అణగారిన వర్గాలపై సామాజిక సందేశాన్ని అందించిన ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా గుర్తింపు పొందింది. దర్శకుడు యదు వంశీకి ఉత్తమ తొలి దర్శకుడు అవార్డు లభించింది. గామా అవార్డ్స్‌లో నిహారిక కొణిదెలకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్, యదు వంశీకి బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ అవార్డులు వచ్చాయి.

ఇక తాజాగా జరిగిన సైమా 2025 అవార్డుల్లోనూ ఈ సినిమా నిలిచింది. నిహారిక కొణిదెలకు బెస్ట్ డెబ్యూ ప్రొడ్యూసర్, సందీప్ సరోజ్‌కు బెస్ట్ డెబ్యూ యాక్టర్ అవార్డులు లభించాయి. దీంతో నిహారిక తన తొలి ఫీచర్ ఫిల్మ్‌తోనే టాలీవుడ్‌లో అరుదైన రికార్డు సృష్టించారు. ఈ చిత్రానికి యదు వంశీ దర్శకత్వం వహించగా, ఎదురురోలు రాజు సినిమాటోగ్రఫీ, అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. మన్యం రమేష్ ప్రొడక్షన్ వ్యవహారాలు చూసుకున్నారు. 2024 ఆగస్టు 9న విడుదలైన ‘కమిటీ కుర్రోళ్లు’ కంటెంట్, మెసేజ్‌తో పాటు కమర్షియల్ హంగులతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

Exit mobile version