
Comrade Kalyan: మినిమమ్ గ్యారెంటీ కామెడీతో ప్రేక్షకులను థియేటర్లకు రప్పించడంలో హీరో శ్రీ విష్ణు శైలే వేరు. ఆయన నుంచి తాజా చిత్రంగా వచ్చిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ ఈ వీకెండ్ బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే ఆరంభాన్ని అందుకుంది. జానకిరామ్ దర్శకత్వంలో మహిమా నంబియార్ కథానాయికగా రూపొందిన ఈ సినిమాకు థియేటర్లలో మిక్సిడ్ టాక్ వచ్చినప్పటికీ, వసూళ్ల విషయంలో మాత్రం తగ్గేదేలే అంటూ దూసుకుపోయింది.
ఈ వారం విడుదలైన సినిమాల్లో చెప్పుకోదగ్గ ప్రాజెక్ట్‌గా బరిలోకి దిగిన ‘కామ్రేడ్ కళ్యాణ్’ సినిమాలో శ్రీ విష్ణు మార్క్ టైమింగ్, వినోదం ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో మొదటి రోజే థియేటర్ల వద్ద సందడి కనిపించింది. టాక్‌తో సంబంధం లేకుండా తొలిరోజే ఏకంగా రూ.4.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ అధికారికంగా కలెక్షన్ల పోస్టర్‌ను విడుదల చేసింది. ఫస్ట్ డేనే రూ.4.5 కోట్లు కొల్లగొట్టిన ఈ చిత్రం, వీకెండ్‌లో ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఏ మేరకు థియేటర్లకు రప్పిస్తుందో చూడాలి.
