
Dhanush : తమిళ స్టార్ హీరో ధనుష్ అభిమానులకు ఆయన పుట్టినరోజు సందర్భంగా అదిరిపోయే సర్‌ప్రైజ్ రెడీ అవుతుంది. రాజ్‌కుమార్ పెరియస్వామి డైరెక్షన్‌లో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఓం’ (OM) సినిమా నుంచి ఫస్ట్ పాటను జూలై 28న రిలీజ్ చేయాలని చిత్ర బృందం ప్లాన్ చేస్తుందట. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. తాజా సమాచారం ప్రకారం.. ఈ ఫస్ట్ సింగిల్ ఓ పూర్తి స్థాయి మాస్ డాన్స్ నంబర్‌గా ఉండబోతోందట. చాలా కాలం తర్వాత ధనుష్ ఇలాంటి ఎనర్జిటిక్ డాన్స్ ట్రాక్‌లో కనిపించనున్నారని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఈ పాటపై ఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ చిత్రానికి యంగ్ మ్యూజిక్ సెన్సేషనల్ సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్నారు. ఆయన స్వరపరిచిన ఈ పాట వైరల్ చార్ట్‌బస్టర్‌గా నిలుస్తుందని చిత్ర యూనిట్ నమ్మకం వ్యక్తం చేస్తోంది. ధనుష్ స్టైలిష్ డాన్స్ స్టెప్పులు, సాయి అభ్యంకర్ మ్యూజిక్ కలిసి అభిమానులకు ప్రత్యేకమైన అనుభూతిని ఇవ్వనున్నాయని టాక్ వినిపిస్తోంది. అంతేకాదు ఈ సినిమాలో ధనుష్ తనకు గత చిత్రాలకు పూర్తి భిన్నంగా మాస్ అవతార్‌లో కనిపించనున్నారని సమాచారం. దీంతో ఆయన అభిమానులు ఈ సినిమా అప్డేట్స్ గురించి ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
