
DV4: కోలీవుడ్ స్టార్ హీరో విక్రమ్ తనయుడు, యువ హీరో ధ్రువ్ విక్రమ్ తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించారు. ఆయన నటిస్తున్న 4వ చిత్రానికి (‘DV4’) సంబంధించిన అధికారిక ఫస్ట్ లుక్ పోస్టర్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోందని చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. తాజాగా రిలీజ్ అయిన ‘DV4’ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ పోస్టర్‌లో ధ్రువ్ విక్రమ్ లీడ్ రోల్‌లో ఎంతో పవర్‌ఫుల్ యాక్షన్ మూడ్‌లో కనిపిస్తున్నారు. ఈ పోస్టర్ బ్యాక్‌గ్రౌండ్‌లో వాతావరణం చూస్తుంటే ఇదొక హై యాక్షన్ థ్రిల్లర్ అనే అనుభూతిని కలిగిస్తోంది. ధ్రువ్ విక్రమ్ లుక్ – బాడీ లాంగ్వేజ్‌ను గమనిస్తే ఈ సినిమా పక్కా యాక్షన్ ప్యాక్డ్ కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రాబోతోందని స్పష్టంగా అర్థం అవుతుంది.
ఈ చిత్రానికి కరణ్ అరవింద్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. దర్శకుడిగా ఆయనకిదే తొలి చిత్రం కావడం విశేషం. ఒక వైవిధ్యమైన, పవర్‌ఫుల్ కథతో ఆయన ధ్రువ్‌ను వెండి తెరపై ప్రెజెంట్ చేయబోతున్నారని సమాచారం. టాలీవుడ్‌లో వరుస బ్లాక్‌బస్టర్ హిట్లతో దూసుకుపోతున్న ప్రముఖ నిర్మాణ సంస్థ ‘మైత్రీ మూవీ మేకర్స్’ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. ధ్రువ్ విక్రమ్ నటనకు మంచి గుర్తింపు తెచ్చిన స్పోర్ట్స్ డ్రామా ‘బైసన్ కాలమాడన్’ తర్వాత వస్తున్న ప్రాజెక్ట్ ఇదే కావడంతో అటు కోలీవుడ్, ఇటు టాలీవుడ్ వర్గాల్లో దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించిన పూర్తి వివరాలను అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం.
