
Deva Katta: ‘ప్రస్థానం’, ‘రిపబ్లిక్’ వంటి వైవిధ్యభరితమైన సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ క్రియేట్ చేసుకున్న డైరెక్టర్ దేవా కట్టా (Deva Katta). ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆయన గురించి వైరల్ అవుతున్న కొన్ని రూమర్లపై తాజాగా ఆయన ఘాటుగా స్పందించారు. కేవలం క్లిక్స్ కోసం కొందరు తనపై బ్యాడ్ టేస్ట్‌తో తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు.
గత కొద్దిరోజులుగా దేవా కట్టా వేరే డైరెక్టర్ల సినిమాలకు లేదా ఇతర ప్రాజెక్ట్స్‌కు ఘోస్ట్ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారని, కొన్ని సీన్లు డైరెక్ట్ చేస్తున్నారంటూ ఫిలిం నగర్ వర్గాల్లో కొన్ని వార్తలు హల్‌చల్ చేశాయి. ఈ రూమర్లపై తాజాగా దేవా కట్టా X వేదికగా స్పందిస్తూ.. “నేను వేరే ఏ సినిమాకు సంబంధించి ఒక్క షాట్ కూడా డైరెక్ట్ చేయడం లేదు. కేవలం వ్యూస్, క్లిక్స్ కోసం కొంతమంది బ్యాడ్ టేస్ట్‌తో సర్క్యులేట్ చేస్తున్న రూమర్స్ ఇవి. వాటిని నమ్మకండి” అంటూ గట్టిగా క్లారిటీ ఇచ్చారు.
ప్రస్తుతం తన ఫోకస్ మొత్తం తన నెక్స్ట్ సినిమాపైనే ఉందని దేవా కట్టా వెల్లడించారు. “నా నెక్ట్స్ సినిమాకు సంబంధించిన కథా చర్చలు, స్క్రిప్ట్ డెవలప్‌మెంట్‌తోనే నా టైం గడుస్తోంది. ఈ సరికొత్త జర్నీ నన్ను ఎంతో ఎగ్జైట్ చేస్తోంది. నా కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన, మనసుకు హత్తుకునే ఒక భారీ కథతో మీ ముందుకు రాబోతున్నాను. సమయం వచ్చినప్పుడు దీనికి సంబంధించిన అన్ని వివరాలను అధికారికంగా పంచుకుంటాను” అని ఆయన పేర్కొన్నారు. దేవా కట్టా ఇచ్చిన ఈ సాలిడ్ క్లారిటీతో ఆయనపై వస్తున్న పుకార్లకు పూర్తిగా తెరపడినట్లయింది. మరి ఈ క్రేజీ డైరెక్టర్ తన నెక్ట్స్ చిత్రం ఏ హీరోతో చేయబోతున్నారో చూడాలి.
Been spending most of my time writing and developing my next film. Excited about the journey ahead.
Just to clear some rumours circulating in bad taste for clicks — I’m not at all directing even a single shot from any other films!! Looking forward to sharing updates on my most…
— deva katta (@devakatta) June 12, 2026
