Site icon TeluguMirchi.com

Nandini Reddy: షూటింగ్ టైమ్‌లోనే సమంత ప్రెగ్నెంట్.. అసలు నిజం బయటపెట్టిన డైరెక్టర్ నందినీ రెడ్డి!

Nandini Reddy

Nandini Reddy: టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత, ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డిలది ఇండస్ట్రీలో క్రేజీ కాంబినేషన్. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన ‘జబర్దస్త్’, ‘ఓ బేబీ’ చిత్రాలు ప్రేక్షకులను ఎంతగానో అలరించాయి. తాజాగా వీరి కాంబోలో వచ్చిన ‘మా ఇంటి బంగారం’ సినిమా కూడా థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతూ సూపర్ సక్సెస్ అందుకుంది. తాజాగా డైరెక్టర్ నందినీ రెడ్డి ఒక పాడ్‌కాస్ట్‌లో సమంత ప్రెగ్నెన్సీ గురించి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఈ సందర్భంగా నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘మా ఇంటి బంగారం’ షూటింగ్ సమయంలో జరిగిన ఒక అత్యంత వ్యక్తిగతమైన, ఆసక్తికరమైన విషయాన్ని బయటపెట్టారు. “సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతున్న సమయంలోనే.. సమంత ప్రెగ్నెంట్ అనే విషయం తెలిసింది. ఆ సమయంలో ఆ గుడ్ న్యూస్ సెట్‌లో ఉన్నవారందరిలో కేవలం నాకు మాత్రమే తెలుసు. ఆ విషయం బయటకు లీక్ కాకుండా మేం ఇద్దరం చాలా జాగ్రత్తలు తీసుకున్నాం” అని నందినీ రెడ్డి వెల్లడించారు. గర్భిణీగా ఉన్న సమయంలో సమంత షూటింగ్‌లో ఎలా పాల్గొంది అనేదానిపై దర్శకురాలు స్పందిస్తూ.. “లక్కీగా సమంత ప్రెగ్నెన్సీ విషయం తెలిసే సమయానికే సినిమాకు సంబంధించిన హెవీ యాక్షన్ సీక్వెన్స్‌లు మొత్తం పూర్తయ్యాయి. దాంతో మాకు పెద్దగా ఇబ్బంది ఎదురవ్వలేదు. కానీ ఆ తర్వాత మిగిలిన షూటింగ్ పార్ట్ మొత్తం సమంత హెల్త్‌ను దృష్టిలో పెట్టుకునే ప్లాన్ చేశాం. ఆమెకు ఎక్కడా స్ట్రెయిన్ అవ్వకుండా, కొంచెం ఎక్కువ రెస్ట్ ఇస్తూనే మిగతా షూటింగ్‌ను సక్సెస్‌ఫుల్‌గా పూర్తి చేశాం” అని నందినీ రెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Exit mobile version